NTV Telugu Site icon

Congress First List: నాలుగో సారి భట్టి.. ఆరో సారి పోటీ చేస్తున్న పొదెం వీరయ్య

Bhati Podam Verayya

Bhati Podam Verayya

Congress First List: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు స్థానాలకు అదికూడ సిట్టింగ్ స్థానాలకు అభ్యర్ధిలను కాంగ్రెస్ అధిష్టానం వెల్లడించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది స్థానాలు ఉండగా అందులో మధిర నుంచి భట్టి విక్రమార్క, భద్రాచలం నుంచి పొదెం వీరయ్యను అబ్యర్ధులుగా అధిష్టానం ప్రకటించింది. భట్టి విక్రమార్క నాలుగో సారి ఎన్నికల బరిలో దిగనున్నారు. అంతకు ముందు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా స్థానిక సంస్థ ల ఎంఎల్ సి గా గెలుపొందాడు. ఆ తరువాత మధిర నుంచి 2008 ,2014,2018 లలో పోటీ చేసి భట్టి విక్రమార్క గెలుపొందాడు. భట్టి విక్రమార్క మధిర నుంచి మూడు సార్లు వరుస వెంట గెలిచి హ్యాట్రిక్ సాదించాడు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోచివరలో భట్టి విక్రమార్క డిప్యూటీ స్పీకర్ గాకూడ పనిచేశారు. అయితే ఈ సారి గెలిచిన తరువాత సిఎల్పీ నేత గా కూడ ఉన్నాడు. ఈ తరుణంలోకాంగ్రెస్ అదికారంలోకి వస్తే భట్టి సిఎం అవుతారన్న ప్రచారం కూడ ఉంది. భట్టి విక్రమార్క చేసిన పాదయాత్ర ఆయనకు చాలా ఉపయోగ పడుతుంది.

ఇకపోతే భద్రాచలం నుంచి పోటీ చేయనున్న పొదెం వీరయ్య ఇప్పటికి మూడు సార్లు ఎంఎల్ఎగా పని చేశారు. ములుగు ఎంఎల్ఎగా ఆయన ప్రస్తానం ప్రారంబం అయ్యింది. ములుగులో 1997 లో స్వతంత్రంగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆతరువాత 1999, 2004 కాంగ్రస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత మళ్లీ 2009 లో కాంగ్రెస్ నుంచి పోటీచేయగా అప్పటిలో టీడీపీ నుంచి పోటీచేసిన సీతక్క గెలుపొందింది. ఇకపోతే 2014 కాంగ్రెస్ నుంచి పోటీచేసి మరో సారి ఓటమి పాలుఅయ్యారు. కాగా ములుగులో సీతక్కకు అవకాశం కల్పించే దానిలో భాగంగా 2018 లో భద్రాచలంనుంచి కాంగ్రెస్ సీటును ఇచ్చింది. స్థానికేతరుడు అయినప్పటికి భద్రాచలం నుంచి పోటీచేసి గెలుపొందారు.

అయితే ఖమ్మం జిల్లాలో ఆరు స్తానాల్లో కాంగ్రెస్ 2018 లో గెలిచినప్పటికి పొదెం వీరయ్య మీద ఎంత వత్తిడి వచ్చినప్పటికి పొదెం మాత్రం పార్టీ మారకుండా ఉన్నాడు. భద్రాద్రి జిల్లాలో అయిదు స్థానాలు ఉండగా అయిదు స్థానాల్లో కూడ 2018 లో కాంగ్రెస్ టిడిపి అలయెన్స్ లు గెలిచారు. అయితే నలుగురు పార్టీ మారి బిఆర్ఎస్ లోచేరినప్పటికి పొదెం వీరయ్య మాత్రం పార్టీ మారకుండా కాంగ్రెస్ కోసంకృషి చేశారు. ఎటువంటి ఆరోపణలు లేని వ్యక్తిగా పోదెం వీరయ్యకు పేరు ఉంది. దీంతోఅధిష్టానం పొదెం వీరయ్యు ప్రాధాన్యత ఇచ్చింది. సిపిఎం పార్టీ జాతీయ స్థాయిలో భద్రాచలం సీటు ఇవ్వాలని వత్తిడి చేసినప్పటికి పొదెం వీరయ్యను వదులుకునేందుకు కాంగ్రెస్ ఇష్ట పడలేదు..