NTV Telugu Site icon

Mirchi Price: పసిడిని దాటిన మిర్చి రేట్.. ఎనుమాముల మార్కెట్‌లో మిర్చికి రికార్డు ధర

Mirchi Price

Mirchi Price

Mirchi Price: మిర్చి ధర కొత్త రికార్డు సృష్టించింది. వరంగల్‌ జిల్లా ఎనుమాముల మార్కెట్‌ లో ఆల్‌ టైమ్‌ హై రికార్డులు నెలకొల్పింది. వరంగల్ జిల్లాలో మిర్చి ధర బంగారం రేటు దాటి పోయింది. దేశీ మిర్చి ధర ఏకంగా రూ. 80,100 వేలు పలికింది. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో దేశీ కొత్త మిర్చి చరిత్రలోనే హై రేట్ నమోదు చేసుకుంది. శుక్రవారం 3 వేల మిర్చి బస్తాలు మార్కెట్ కి వస్తే గంటన్నర లోనే కొనుగోళ్లు పూర్తీ కావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు రైతులు. మిర్చికి డిమాండ్‌ ఉండడంతో వ్యాపారులు కొనేందుకు పోటీ పడ్డారు. దీంతో ఉదయం 8 లోపు మిర్చి కొనుగోలు పూర్తి కావడం ఇది రికాడ్డు బద్దలు కొట్టినట్టైంది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఎన్నడు లేని విధంగా కొత్త దేశీ మిర్చికి రికార్డు ధర పలికింది. ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం రావి చెట్టు తండాకు చెందిన రాములు నాయక్ దేశీ మిర్చి నాలుగు బస్తాలు తేవడంతో కొనుగోలుదారులు పోటీ పడ్డారు. దీంతో క్వింటాలు మిర్చి బస్తా 80 వేల ఒక వందకు చేరింది. దీంతో రాములు నాయక్‌ ఆనందం వ్యక్తం చేశారు. అసలే చలికాలం ఆపై మిర్చిని కొనుగోలు చేస్తారా అనే నిరాశతో వచ్చిన రాములుకు బంగారం ధరకంటే మిర్చీకే రేటు పలుకడంతో ఆనందం వ్యక్తం చేశాడు. మార్కెట్ కు కేవలం 2500 కొత్తమిర్చి బస్తాలు వచ్చాయని, తక్కువ మిర్చి రావడంతోనే కొనుగులు దారుకు పోటీ పడడంతో మిర్చికి రికార్డు ధర వచ్చిందంటున్నారు వరంగల్ మార్కెట్ వర్గాలు. ఏదైతే నేం ఇవాళ మిర్చే రేటు బంగారం ధర కంటే ఎక్కువ రేటు పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read also: Cold Wave: గజగజ వణికిస్తున్న చలి.. ఢిల్లీలో రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు

గతంలో ఇదే మిర్చిధర ధర రూ. 20 వేలకు పైగా ధర పలికింది. గతంలో దేశవాలీ మిర్చి బస్తాలు రోజుకు 1000 నుంచి 2000 బస్తాలు వచ్చేవి. కానీ దిగుబడి తగ్గడంతో దేశవాలీ మిర్చి ఒకటి, రెండు బస్తాలు మాత్రమే లభిస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. దేశీ మిర్చితో పాటు ఇతర రకాల మిర్చిలకు విపరీతమైన డిమాండ్ ఉంది. గతంలో కూడా ఈ మార్కెట్‌లో మిర్చికి భారీ ధర పలికిన సందర్భాలు ఉన్నాయి. సెప్టెంబర్ 29, 2022న క్వింటాల్ మిర్చి రూ. 90,000. గతేడాది మార్చిలో క్వింటాల్ మిర్చి రూ.52 వేల ధర పలికింది. వేసవి వచ్చేస్తోంది ఈ సమయంలో పచ్చళ్లు పెట్టేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. దీంతో పచ్చళ్లు పెట్టేందుకు గిరాకీ పెరుగుతుండటంతోనే దేశీయ మిర్చికి డిమాండ్ పెరిగిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నారు.

Show comments