NTV Telugu Site icon

TS Rains: తెలంగాణకు కొనసాగనున్న రెడ్ అలెర్ట్.. ప్రజలకు ఐఎండీ వార్నింగ్..

Musi

Musi

TS Rains: ఉత్తర ఆంధ్రప్రదేశ్.. ఒరిస్సా.. ఛతీస్ ఘడ్ తీరాల్లో బలపడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత ఎనిమిది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు, పలు రహదారులు జలమయమయ్యాయి. మరో 24గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా.. ఇప్పటికే తెలంగాణకు రెడ్ అలెర్ట్ కొనసాగుతుంది. దీంతో ప్రజలకు ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. హైదరాబాద్ కు మరోసారి భారీ వర్ష సూచన పొంచి వుందని తెలిపింది. అధికారులంతా అలెర్ట్ గా ఉండాలని ఐఎండీ సూచించింది. అత్యవసరమైతేనే బయటకు రావాలని ఐఎండీ ప్రజలకు వార్నింగ్ ఇచ్చింది.

బోడుప్పల్ లోని ఫిర్జాదిగూడ మున్సిపల్ పరిధిలోని విష్ణుపురి కాలనీ నీట మునిగింది. రోడ్లపై వరద నీరు ఏరులై పారుతుంది. ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో కాలనీవాసులు నానా కష్టాలు పడుతున్నారు. వరద నీటిలో కొట్టుకొస్తున్న పాములతో భయభ్రాంతులకు గురవుతున్నారు. చెంగిచెర్ల పైనుంచి వరద నీరు అంతా కూడా పీర్జాది గూడా విష్ణుపురి కాలనీ వస్తుంది. గత ఐదేళ్లుగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నామంటున్నామని ఇప్పటి వరకు ఎటువంటి సహాయం అందలేదని వాపోతున్నారు. ఇప్పటి కైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Read also: CM KCR: హెలికాప్టర్‌ ద్వారా సహాయక చర్యలు చేపట్టండి.. అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం

గాజులరామారం సింధి బస్తి లోని ఇళ్లన్నీ జల దిగ్బంధనంలో ఉన్నాయి. గత ఎనిమిది రోజులుగా భారీ వర్షాలకు దగ్గర్లోని చెరువులు నిండిపోయి ఇళ్లలోకి నీరు చేరుతున్నాయి. మొత్తం కాలనీ అంతా చెరువును తలపించే విధంగా నీట మునిగి పోయింది. తమ సమస్యను పరిష్కరించేందుకు ఏ అధికారులు రాలేదంటూ చిన్న చిన్న పిల్లలతో మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిండి తిప్పలు లేకుండా ఇక్కడ అనేక కుటుంబాలు జీవనం సాగిస్తున్నారు. సింధీ బస్తికి ఆనుకుని ఒక అపార్ట్మెట్స్ నిర్మాణం చేపట్టిన తరువాత ఈ సమస్య వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. అధికారులు స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ హైదర్ గూడలో రెండు ఇండ్లు కుప్పకూలాయి. ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి తడిసి ముద్దైన ఇండ్లు. ఒక్కసారిగా కుప్పకూలిన పై కప్పు. భారీ శబ్దం రావడంతో బయటకు పరుగులు తీసిన స్థానికులు. ఇంటి పై కప్పు కూలడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు. ఇండ్లు కూలిన‌ ప్రాంతాన్ని స్థానిక కార్పోరేట్ సంగీత సందర్శించారు. గ్రేటర్ పరిధిలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అతలాకుతలం అయ్యింది. దీంతో ఎఫెక్టెడ్ ఏరియాల్లో మున్సిపల్ మంత్రి కేటీఆర్ పరిశీలనకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం తరువాత ముసారం బాగ్ బ్రిడ్జ్ వద్దకు కేటీఆర్ వెళ్లే అవకాశం ఉందని సమాచారం. భారీ వర్షాల కారణంగా మూసి నది ఉదృతంగా ప్రవహిస్తుంది. ఇటు హుస్సేన్ సాగర్, అటు జంట జలాశయాల నీళ్లు కలిసే స్థలం ముసారం బాగ్ బ్రిడ్జ్ కావడంతో హెవీ ప్లోడ్ చేరడంతో మంత్రి అక్కడకు వెళ్లి పరిశీలించనున్నారు.
CM KCR: హెలికాప్టర్‌ ద్వారా సహాయక చర్యలు చేపట్టండి.. అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం

Show comments