Rebel Star Krishnam Raju Final Journey Live : రారాజు అంతిమయాత్ర LIVE
-
ముగిసిన కృష్ణంరాజు అంత్యక్రియలు
అధికారిక లాంఛనాలతో నటుడు కృష్ణంరాజు అంత్యక్రియలు ముగిశాయి.కనకమామిడి లోని వ్యవసాయ క్షేత్రంలో భారీగా తరలివచ్చిన అభిమానుల మధ్య అభిమాన నటుడికి అంతిమ వీడ్కోలు పలికారు. అంత్యక్రియలకు కృష్ణంరాజు బంధువులు, కుటుంబసభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. కన్నీటి పర్యంతం అవుతూ ఆయన అంత్రక్రియల్లో పాల్గోని ప్రభాస్ ని ఓదార్చారు.
-
కన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులు
మొయినాబాద్ కనకమామిడి ఫాంహౌస్‌లో కృష్ణంరాజు అంత్యక్రియలు జరుగుతున్నాయి. కడసారిగా తన భర్త పార్ధివ దేహానికి శ్యామలాదేవి కన్నీటితో నివాళులు అర్పించారు. అటు ప్రభాస్ కూడా కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలను నిర్వహిస్తున్నారు.
-
కనకమామిడి ఫాంహౌస్‌కు చేరుకున్న ప్రభాస్ కుటుంబ సభ్యులు
మొయినాబాద్‌లోని కనకమామిడి కృష్ణంరాజు వ్యవసాయ క్షేత్రానికి ప్రభాస్ కుటుంబ సభ్యులు చేరుకున్నారు.
-
చివరిగా చూసేందుకు భారీ తరలి వచ్చిన అభిమానులు
కృష్ణం రాజు అంతిమయాత్రకు భారీగా రాజకీయ నాయకులు, సీని ఇండస్ట్రీ పెద్దలు, అభిమానులు, భారీగా తరలివచ్చారు. అంతిమ యాత్రలో ప్రతి ఒక్కరు కన్నీరు మున్నీరవుతున్నారు. కృష్ణం రాజు మృతి సినీ ఇండస్ట్రీ శోక సముద్రంలో మునిగిపోయింది. మంచి నటుడు, రెబర్ స్టార్ ను కోల్పోయింది.
-
మహాప్రస్థానంలో కాకుండా.. కనకమామిడి ఫామ్ హౌస్ లో మార్చింది అందుకే..
ముందుగా జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరపాలని కుటుంబ సభ్యులు భావించారు. కానీ ఆయనను కడసారి చూసేందుకు వచ్చే అభిమానులు తాకిడికి జూబ్లీహిల్స్ మహాప్రస్థానం అయితే ఇబ్బందికరంగా ఉంటుందని పోలీసులు, ప్రభుత్వం సలహా మేరకు ఆయన అంత్యక్రియలు జరిగే ప్లేస్ మార్చారని తెలుస్తోంది. ఆయన అంత్యక్రియలను హైదరాబాద్ శివారు మొయినాబాద్ కనకమామిడి ఫామ్ హౌస్ లో నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.
-
అధికార లాంఛనాలతో కృష్ణంరాజు అంతిమయాత్ర
అధికార లాంఛనాలతో కృష్ణంరాజు అంతిమయాత్ర కొనసాగుతుంది. కృష్షంరాజు పార్దీవదేహానికి పోలీసుల గౌరవ వందనం చేశారు. జూబ్లీహిల్స్ నివాసం నుంచి రోడ్ నెం 45-బిఎన్ఆర్ కాలనీ బ్రిడ్జ్-గచ్చిబౌలి ఓఆర్ ఆర్ మీదుగా అప్పా జంక్షన్ వద్ద దిగుతుంది. అక్కడి నుంచి మొయినాబాద్ - కనకమామిడి లోని ఫామ్ హౌజ్ కు చేరుకుంటుంది.
-
అంతిమయాత్ర ప్రారంభం...
కృష్ణంరాజు అంతిమయాత్ర ప్రారంభం.. బీఎన్‌ఆర్ కాలనీ బ్రిడ్జ్, గచ్చిబౌలి, ఓఆర్‌ఆర్, అప్పా జంక్షన్ మీదుగా మొయినాబాద్‌కు అంతిమయాత్ర.. మొయినాబాద్ కనకమామిడి ఫాంహౌస్‌లో కృష్ణంరాజు అంత్యక్రియలు