NTV Telugu Site icon

Election ink: ఎన్నికల సిరాను ఎక్కడ తయారు చేస్తారో తెలుసా..?

Election Ink

Election Ink

Election ink: ఎన్నికల్లో ఓటు మాత్రమే కాదు.. సిరా చుక్క కూడా కీలక పాత్ర పోషిస్తుంది. సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు ఎన్నికల రోజున సిరా చుక్కతో వేలి చూపి ఓటేసినట్లు చూపిస్తుంటారు. ఓటు వేశామని చెప్పుకోవడానికి గుర్తు మాత్రమే కాదు.. దొంగ ఓట్లను అరికట్టేందుకు సిరా చుక్క ఆయుధం. భారత్‌తోపాటు ఇతర దేశాల్లో ఎన్నికల సమయంలో ఓటు వేసిన అభ్యర్థికి వేలి సిరా చుక్క వేయడం ఆనవాయితీ. దేశ గమనాన్ని మార్చే ఓటు.. ఆ ఓటును ఖరారు చేసే సిరా చుక్క మన హైదరాబాద్‌లోనే తయారవుతోంది. భారత ఎన్నికల సంఘం రూల్ 37 ప్రకారం ఓటు వేసిన వ్యక్తి ఎడమ చేతి చూపుడు వేలిపై సిరా గుర్తు ఉంటుంది. ఈ ఇంక్ డాట్ పద్ధతిని ఎన్నికల సంఘం 1962లో ప్రవేశపెట్టింది. సిరా చుక్క బాటిల్ ను భారత ఎన్నికల సంఘం పోలింగ్ స్టేషన్‌లకు సరఫరా చేస్తుంది. ఎన్నికల సమయంలో ఉపయోగించే ఇంక్ డ్రాప్‌ను వాస్తవానికి కర్ణాటక రాష్ట్రానికి చెందిన మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ కంపెనీ తయారు చేసి సరఫరా చేసింది. భారతదేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇక్కడి నుంచే సరఫరా జరిగేది.

Read also: Astrology: మే 12, ఆదివారం దినఫలాలు

ఆ తర్వాత 1990 నుంచి హైదరాబాద్‌లో ఇంక్ డ్రాప్ తయారీ ప్రారంభమైంది. ఉప్పల్‌లోని రాయుడు లేబొరేటరీస్ అనే సంస్థ ఎన్నికల కమిషన్‌కు ఇంక్ డ్రాప్‌ ను సరఫరా చేస్తుంది. మైసూర్ కంపెనీతో పోలిస్తే చిన్న కంపెనీ అయినప్పటికీ.. దేశాల్లో జరిగే ఎన్నికల కోసం దాదాపు వంద దేశాలకు ఇండెలబుల్ సిరా సరఫరా చేస్తున్నామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. భారత్ తో పాటు శ్రీలంక, నైజీరియా, మాల్దీవులు, ఇథియోపియా, జాంబియా, దక్షిణాఫ్రికా, తూర్పు తైమూర్ తదితర దేశాలకు పంపిణీ చేస్తున్నట్లు కంపెనీ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ సిరాలో వాడే సిల్వర్ నైట్రేట్ శాతాన్ని బట్టి అది చెరిగిపోయే సమయం ఉంటుంది. ఈ సిరా 5 ml, 10 ml, 25 ml, 50 ml, 60 ml మరియు 100 ml బాటిళ్లలో తయారు చేసి, సిద్ధం చేస్తా అన్నారు. ప్రస్తుతం ఎన్నికల కమిషన్‌కు 5 ఎంఎల్‌ బాటిళ్లను సరఫరా చేస్తున్నారు. దాదాపు 300 మందికి ఒక్క సీసా సరిపోతుందని తెలిపారు. ఇటీవల జరిగిన బీహార్ పంచాయతీ ఎన్నికల్లో సిరాకు బదులు మార్కర్ల ఆర్డర్లు వచ్చాయని రాయుడు లేబొరేటరీస్ తెలిపింది. ప్రస్తుతం ఈ కంపెనీలో 25 మంది సిబ్బంది పనిచేస్తున్నారని, కంపెనీ టర్నోవర్ ఏడాదికి 50 నుంచి 60 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.
Maharashtra: ఘోర ప్రమాదం.. టైర్ పేలి ముగ్గురు మహిళలు మృతి