Site icon NTV Telugu

Former MP Ravindra Naik : కేసీఆర్ రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నారు

Former MP Ravindra Naik Fired on TRS Government.

తెలంగాణలో గిరిజన రిజర్వేషన్లపై చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్‌ మాట్లాడుతూ.. గిరిజన రిజర్వేషన్ల విషయంలో సీఎం కేసీఆర్ గిజనులను మోసం చేశాడని ఆయన అన్నారు. అంతేకాకుండా సీఎం కేసిఆర్ తన గూండాలను పంపి బీజేపీ కార్యాలయం పై దాడులు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. సీఎం కేసీఆర్ ప్రజా సమస్యలు పట్టించుకోకుండా రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి గిరిజన రిజర్వేషన్‌పై నివేదిక పంపించలేదన్నారు.

గిరిజన జనాభా 9.08 ఉంది జనాభాను దృష్టిలో పెట్టుకొని వెంటనే రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం పెంచాలని ఆయన అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో గిరిజనులకు రిజర్వేషన్లు కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని, గిరిజనుల వల్ల అధికారంలోకి వచ్చి గిరిజనులను సీఎం కేసీఆర్ మోసం చేశాడని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ఉద్యోగాల భర్తీ చేయకుండా ప్రజలను తప్పు తోవ్వపట్టించాడని కొత్త డ్రామాలు మొదలు పెట్టారని ఆయన విమర్శించారు.

Exit mobile version