Site icon NTV Telugu

Medicover Hospitals : అరుదైన శస్త్రచికిత్స..

Hand

Hand

పూర్తిగా తెగి క్రింద పడిన ఎడమ అరచేయిని అత్యంత ఖచ్చితత్త్వంతో కూడిన శస్త్రచికిత్సతో శరీరానికి అతికించడం ద్వారా ఓ యువకునికి నూతన జీవితం ప్రసాదించిన మెడికవర్‌ వైద్యులు కేతారామ్ 18 సంవత్సరాల వయస్సు మరియు రాజస్థాన్ నివాసి 4-6-2022న పదునైన యంత్రాలు-అల్యూమినియం కట్టింగ్ మెషిన్‌తో పని చేస్తున్నాడు . సాయంత్రం 7 గంటలకు అతని ఎడమ చేయి ప్రమాదవశాత్తూ మెషిన్ లో పడి పూర్తిగా అరచేయిబాగం తెగిపోయి కిందపడటం జరిగింది. తక్షణమే అతని సమస్యకు తగిన పరిష్కారం చూపగలిగే ఆరోగ్యకేంద్రం ఏదీ ఆయనకు దొరకలేదు. ఈ సమయంలోనే అతనికి తెలిసిన వ్యక్తులు కొందరు మెడికవర్‌ హాస్పిటల్స్‌లో డాక్టర్‌ ఆర్‌ సునీల్‌ ను కలిస్తే ఫలితముంటుందని సూచించారు. దానితో తక్షణమే అతనిని అతని కుటుంబసభ్యులు హైటెక్‌ సిటీ వద్దనున్న మెడికవర్‌హాస్పిటల్స్‌కు అతని చేతి నుంచి విడిపోయిన అరచేతిని అతి జాగ్రత్తగా భద్రపరిచి అత్యవసర విభాగానికి శస్త్రచికిత్స కోసం తీసుకువచ్చారు.అర్ధరాత్రి డాక్టర్‌ ఆర్‌ సునీల్‌ – కన్సల్టెంట్‌ హ్యాండ్‌ అండ్‌ రిస్ట్‌ సర్జన్‌, ఆర్థోపెడిక్‌ అండ్‌ ట్రౌమా సర్జన్‌ బృందం ఈ శస్త్రచికిత్సను చేసింది.

5 గంటల పాటు కొనసాగిన సంక్లిష్ట శస్త్రచికిత్స తర్వాత, గాయపడిన చేతి యొక్క అన్ని నిర్మాణాలను మైక్రో సర్జికల్ రిపేర్ చేయడం మరియు అతని చేతికి రక్త ప్రవాహాన్ని ఏర్పాటు చేయడానికి సిరల అంటుకట్టుటలను ఉపయోగించడం, తెగిపడిన చేతికి రక్త సరఫరా పునరుద్ధరించడంతో పాటుగా ఎముకలు అతికించిన తరువాత నరాలు, కండరాలను కూడా సరిచేశారు కత్తిరించిన భాగాన్ని మైక్రోస్కోపిక్‌ ఖచ్చితత్త్వంతో అతని చేతిని తిరిగి జోడించడం జరిగింది. శస్త్రచికిత్స తరువాత అతనిని అతి సన్నిహితంగా పరిశీలించడంతో పాటుగా ఎలాంటి దుష్పలితాలూ లేవనుకుని నిర్థారించుకున్న తరువాత అతనిని డిశ్చార్జ్‌ చేశారు. తెగి పడిన చేతిని అతికించడం అనేది అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స. దీనికి తగిన నైపుణ్యం కావాల్సి ఉంటుంది. యుక్త వయసు రోగులకు ఇది చక్కటి ప్రయోజనం కలిగించగలదు. ఎందుకంటే, వారు త్వరగా తిరిగి తమ కార్యకలాపాలను నిర్వర్తించుకోవడం వల్ల అద్భుతమైన మానసిక ప్రయోజనమూ వారికి కలుగుతుంది.

డాక్టర్‌ ఆర్‌ సునీల్‌ మాట్లాడుతూ ‘‘ఈ తెగిపడిన చేతిని అతి జాగ్రత్తగా, ఖచ్చితత్త్వంతో కూడిన శస్త్రచికిత్స చేయడం వల్ల వాటిని పునరుద్ధరించగలిగాము. ఈ రోగి పూర్తిగా కోలుకోవడంతో పాటుగా సంతృప్తి ఉండటం పట్ల మేము ఆనందంగా ఉన్నాము. చాలామందికి తెలియని అంశమేమిటంటే, తెగిపడిన వేళ్లను మరియు చేతులని సైతం సమయానికి తీసుకువస్తే అతికించడం సాధ్యమే అని. తెగిపడిన వెళ్ళాను ఏదయినా కవర్ లేక క్లాత్లో చుట్టుకొని ఐస్ బాక్స్ లో పెట్టుకొని రావాలి. డైరెక్టుగా ఐస్ లో పెట్టకూడదు. సమయానికి హాస్పిటల్ కి తీసురావడం వల్ల యధావిధిగా పనిచేస్తాయి’’ అని అన్నారు. మెడికవర్‌ వైద్యుల తోడ్పాటువల్ల తాను తన పనులకు యధావిధిగా వెళ్లగలనన్న నమ్మకం కలిగిందని ఆ యువకుడు వెల్లడించాడు.

Exit mobile version