విభజన అంశాలను పార్లమెంట్‌లో లేవనెత్తుతామని ఎంపీ రంజిత్‌రెడ్డి ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. అనంతర రంజిత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 23 అంశాలపై పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌లో చర్చించామని తెలిపారు. 23 అంశాలను పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తామన్నారు. ప్రస్తావించాల్సిన అంశాలపై సీఎం కేసీఆర్ తమకు ఒక బుక్‌లెట్ అందించారని పేర్కొన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులపై ఇప్పటికే కేసీఆర్ కేంద్రానికి లేఖలు రాశారని గుర్తుచేశారు. బడ్జెట్ కూర్పు చూశాక రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల కోసం పోరాడు తామని రంజిత్‌రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి కేసీఆర్ దిశా నిర్దేశం చేశారని రంజిత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన అన్ని హక్కులను సాధించే దిశగా పార్లమెంట్‌లో పోరాడుతామని ఎంపీ పేర్కొన్నారు.
23 అంశాలను పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తాం : ఎంపీ రంజిత్‌రెడ్డి
