Site icon NTV Telugu

Fire Accident: పుప్పాల్ గూడ లో భారీ అగ్ని ప్రమాదం.. అపార్ట్‌మెంట్ నిర్వాహకులపై పోలీసులు సీరియస్..

Puppalaguda Fir Accident

Puppalaguda Fir Accident

Fire Accident: రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడలోని గోల్డెన్ ఒరియా అపార్ట్‌మెంట్‌లో శుక్రవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్ లోని మూడవ అంతస్తు ప్లాట్ 202 లో మంటలు చెలరేగాయి. తెల్లవారు జాము 3:30 నిమిషాలకు కిచెన్ లో ఫ్రిజ్ సిలెండర్ పేలింది. ఫ్లాట్ లో పెద్ద శబ్దం రావడంతో అపార్ట్ మెట్ వాసులు అలేర్ట్ అయ్యారు. మంటలను చూసి బయటకు పరుగులు తీశారు. బయటకు వచ్చి 5 మంది కుటుంబ సభ్యులు ప్రాణాలు దక్కించుకున్నారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అయితే ఫైర్ ఇంజన్ పోవడానికి దారి లేక గంట పాటు అగ్నిమాపక సిబ్బంది శ్రమించారు. చివరకు ఘటన వద్దకు చేరుకుని మూడు ఫైర్ ఇంజిన్ ల సహాయంతో‌ మంటలు పూర్తిగా అదుపు చేశారు సిబ్బంది. సుమారు రూ. 50 లక్షల ఆస్తి నష్టం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేసిన బిల్డర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అపార్ట్‌మెంట్ నిర్వాహకుల పై పోలీసులు సీరియస్ అయ్యారు. ఇష్టం వచ్చినట్లు అపార్ట్‌మెంట్ నిర్మాణం చేశారని మండిపడ్డారు.

Read also: Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బాంబు అలజడి.. విమానంలో 136 మంది ప్రయాణికులు..

రంగారెడ్డి జిల్లా ఫైర్ అధికారి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదం జరిగిందని తెల్లవారు సమాచారం అందిందన్నారు. మేము వచ్చే సరికి ఫ్లాట్ లో మంటలు చెలరేగాయన్నారు. అరగంట పాటు శ్రమించి మంటలు పూర్తిగా అదుపు చేసామన్నారు. మూడు ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలు అదుపు చేసామని వెల్లడించారు.
ఇంట్లో ఉన్న దీపాల ద్వారా పక్కనే ఉన్న కర్టెన్స్ కు మంటలు మొదట అంటుకున్నాయన్నారు. ఆతరువాత కిచెన్ సమీపంలో ఉన్న ఫ్రిజ్ కంప్రెసర్ సిలెండర్ పేలిందన్నారు. ఫైర్ ఇంజిన్ లోనికి రావడానికి చాలా సమయం పట్టిందన్నారు. ఫ్లాట్ చుట్టూ గార్డెన్ చెట్లు ఉండడం వల్ల లోనికి వెళ్ళలేక.. దారి లేక.. ఫైర్ సిబ్బంది శ్రమించాల్సి వచ్చిందన్నారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు.

Read also: Ponnam Prabhakar: రైతులు ఆదాయం వచ్చే పంటలు వేయండి.. పొన్నం సూచన..

అపార్ట్‌మెంట్ వాసులు మాట్లాడుతూ.. తెల్లవారు జాము 3:30 నిమిషాలకు b బ్లాక్ 202 ఫ్లాట్ లో ఫ్రిజ్ లో కంప్రెషర్ సిలెండర్ బ్లాస్ట్ అయిందన్నారు. మా పక్క ఫ్లాట్ లో పెద్ద శబ్దం వచ్చిందన్నారు. చూసే లోపు మంటలు అంటుకున్నాయని తెలిపారు. ఫ్లాట్ లో పెద్ద శబ్దం రావడంతో అలర్ట్ అయ్యామన్నారు. ఇంట్లో ఉన్న అందరం బయటికి వచ్చేశామన్నారు. నిబంధనలకు లోబడి అపార్ట్ మెంట్ నిర్మాణం జరిగిందన్నారు. కాల్ చేయగానే ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించారన్నారు. స్పాట్ కి మూడు ఫైర్ ఇంజిన్ లు వచ్చాయన్నారు. మా అపార్ట్‌మెంట్ లో అగ్ని ప్రమాదాలపై రిసెంట్ గా అవగాహన కార్యక్రమాలు జరిగాయన్నారు. అదృష్టవశాత్తూ ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు, కానీ ఆస్తినష్టం జరిగిందని తెలిపారు.

CM Revanth Reddy: నేడు మరోసారి మహారాష్ట్రకు సీఎం.. రెండు రోజులు షెడ్యూల్ ఇదే..

Exit mobile version