NTV Telugu Site icon

T Rammohan Reddy: విమర్శలు కరెక్ట్ కాదు.. సబితా ఇంద్రారెడ్డి పై రామ్మోహన్ రెడ్డి ఫైర్..

Rammohan Reddy

Rammohan Reddy

T Rammohan Reddy: మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శలు కరెక్ట్ కాదని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ చౌక బారు రాజకీయాలు చేస్తుందన్నారు. పాఠ్య పుస్తకాలలో కేసీఆర్ ఫోటో ఉంది, అది తీయమని ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం కు పిర్యాదు చేశానని వెంటనే స్పందించాలని తెలిపారు. ముందు మాటలో ఆ పేజీ తొలగించి పంపించమని చెప్పామన్నారు. SCRT ఉద్యోగుల తప్పిదం వలన ఇలా జరిగిందన్నారు. భాద్యులైన వారి పైన చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. సంబంధిత అధికారులకు నోటీసులు కూడా ఇచ్చారన్నారు. వారి పైన తప్పకుండా చర్యలు ఉంటాయని తెలిపారు. ప్రజాధనం ఎక్కడ దుర్వినియోగం కాలేదన్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శలు కరెక్ట్ కాదని, బీఆర్ఎస్ పార్టీ చౌక బారు రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు.

Read also: Game Changer : శైలేష్ కొలను డైరెక్షన్ లో రాంచరణ్.. పిక్స్ వైరల్..

బీఆర్ఎస్ నాయకులకు విచారణ సంస్థలు ఇచ్చిన నోటీసులకు ముందు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారన్నారు. ఆరు పథకాలలో భాగంగా యువ వికాసం ప్రారంభించామన్నారు. అంతర్జాతీయ పాఠశాలను ప్రతి మండలంలో మా ప్రభుత్వం ప్రారంభిస్తుందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఆదర్శ పాఠశాలలో మొదటి సారిగా పాఠ్య పుస్తకాలతో పాటు నోట్ బుక్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్నామన్నారు. 14 వందల కోట్లతో 24 లక్షల మంది విద్యార్థులకు అదనపు తరగతి గదులు, భోజనశాలలు బాత్ రూమ్ లు కట్టిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాబా సాహెబ్ అంబెడ్కర్ ఆశయాలతో ముందుకు వెళ్తున్నాడని అన్నారు.
Saurabh Netravalkar: అతడి వికెట్‌ తీయడం ఓ ఎమోషనల్‌ మూమెంట్‌: అమెరికా పేసర్‌