Liquor : రామంతపూర్ స్ట్రీట్ నెంబర్ 8లో లిక్కర్ డీసీఎంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్న ఘటన చోటు చేసుకుంది. కరెంట్ వైర్లు కిందికి ఉండటం వల్ల డీసీఎం షార్ట్ సర్క్యూట్ కావడంతో ప్రమాదం జరిగింది. స్థానికులు మంటలు వ్యాపించడాన్ని గమనించి వెంటనే ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం అందించారు. ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో మంటల ప్రభావంతో డీసీఎంలో ఉన్న లిక్కర్ బాటిల్స్ కొంతవరకు దెబ్బతిన్నాయి.
PoK Protests: పాకిస్తాన్ చేజారుతున్న పీఓకే.. ప్రభుత్వంపై జనం తిరుగుబాటు..
ఇదిలా ఉంటే.. మంటల వల్ల రోడ్డు మీద కొన్ని మద్యం సీసాలు పడ్డాయి. ఇది చూసిన పబ్లిక్ అందిన కాడికల్లా రోడ్డు మీద పడ్డ సీసాలను సేకరించారు. పలువురు స్థానికులు ఆ సీసాలను ఎత్తుకెళ్లారు. స్థానిక పోలీసులు ఈ ఘటనపై సమాచారాన్ని సేకరిస్తూ మద్య నిల్వ, విద్యుత్ సేఫ్టీ అంశాలను పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా షార్ట్ సర్క్యూట్ కారణాలను గుర్తించడానికి ఫైర్ డిపార్ట్‌మెంట్ దర్యాప్తు కొనసాగిస్తోంది.
