TBJP Chief :తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్‌రావు
- తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్‌రావు
- పార్టీలో ఎక్కువకాలం ఉన్నవారికే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయం
- అందులో భాగంగానే ఏపీలో మాధవ్, తెలంగాణలో రామచందర్‌రావుల ఎంపిక.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TBJP Chief : తెలంగాణ బీజేపీలో కీలక మార్పు చోటుచేసుకుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావును అధిష్ఠానం ఎంపిక చేసింది. ఈ మేరకు ఆయన నామినేషన్ దాఖలు చేయాల్సిందిగా రాష్ట్ర నాయకత్వానికి కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్టు తెలిసింది. రామచందర్‌రావు ఈరోజు (సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఇప్పటికే పార్టీ కార్యకర్తలు, నాయకులు రామచందర్‌రావుకు అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
Weather Updates : తెలంగాణకు వర్ష సూచన
బీజేపీ అధిష్ఠానం ఈసారి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు పార్టీలో ఎక్కువకాలంగా సేవలందించిన నేతలకే అప్పగించాలనే విధానాన్ని అమలు చేస్తోంది. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో మాధవ్, తెలంగాణలో రామచందర్‌రావు లాంటి వర్గీ నాయకులను ఎంపిక చేసింది. పార్టీ భవిష్యత్ దిశగా నూతన దారిని వేయాలన్న లక్ష్యంతో అనుభవం ఉన్న నేతలకే బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
రామచందర్‌రావు బీజేపీలో చాలా కాలంగా క్రియాశీలంగా ఉన్న నేత. విద్యార్థి దశ నుంచే ఆర్ఎస్ఎస్, బీజేపీకి సంబంధించిన కార్యకలాపాల్లో భాగస్వామిగా ఉన్న ఆయన, హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ న్యాయవాది కూడా. గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవంతో పాటు, పార్టీలో వివిధ స్థాయిలలో నిర్వహణలో పాల్గొన్న ఆయనకు బలమైన మద్దతు ఉంది.
Anchor Swetcha : నా భర్త నిర్దోషి, అమాయకుడు.. తెరపైకి నిందితుడు పూర్ణచందర్ భార్య స్వప్న
తాజావార్తలు
-
Kavya Maran: “ఓడినా తల ఎత్తుకుని వెళ్తాన్నాం”.. SRH టీమ్‌లో ధైర్యం నింపిన కావ్యా మారన్.. వైరల్ వీడియో
-
Nandamuri Tejaswini: డాన్స్ స్టెప్స్ తో మెస్మరైజ్ చేసిన బాలకృష్ణ చిన్న కుమార్తె.. వీడియో వైరల్
-
HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
-
AP Liquor Case: లిక్కర్ కేసులో మరో ఛార్జిషీట్ దాఖలు.. కీలక వివరాలు వెల్లడి
-
Mosquito Repellent Study: షాకింగ్.. స్ప్రే వాసనకు పారిపోవడం కాదు.. ఆకర్షితమవుతున్న దోమలు..!
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..