తెలంగాణ అంతటా ఒకతీరు… ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకతీరు. ఖమ్మం రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గా వుంటాయి. గతంలో ఎంపీగా పనిచేసిన ఆయన గత కొంతకాలంగా స్తబ్ధంగా వున్నారు. మళ్లీ తాజాగా ఆయన పేరు బాగా వినిపిస్తోంది. ఆయనను గులాబీ అధినేత పెద్దల సభకు పంపుతారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. సీఎంవో నుంచి కాల్ వచ్చిందని పదవి ఇస్తామని చెప్పినట్లుగా .. ఇక నామినేషన్ వేయడమే తరువాయి అని అంటున్నారు. నామినేషన్ తేదీ.. నామినేషన్ కోసం ర్యాలీగా వెళ్లేందుకు వందలాది కార్లను సిద్దం చేస్తున్నట్లుగా ప్రచారం సాగుతుంది.
నిజంగా ఈ సారన్న శీనన్నకు రాజ్య సభ దక్కుతుందా.. ఇది కూడా ఒక్క ప్రచారాస్ర్తంగా మిగులుతుందా అనే టాపిక్ నడుస్తోంది. ఖమ్మం జిల్లాలో కొత్త నేతగా ఎదిగిన పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేరు ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తుంది. ఏ పెద్దల సభ ఎన్నికలు వచ్చిన ఆయన పేరు వినిపించడం ఆనవాయితీగా మారింది. సోషల్ మీడియాలో మాజీ ఎంపీ పొంగులేటికి పదవి వస్తుందని వార్తలు రావడం.. అది కాస్తా తుస్సు మనడం గత నాలుగేళ్ల కాలం నుంచి జరుగుతూనే ఉంది. ఇప్పుడు బండా ప్రకాష్ రాజీనామా చేసి రాజ్య సభ స్థానం ఖాళీ అయింది. ఆ స్థానంలో పొంగులేటిని ఎంపిక చేసినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
పొంగులేటి శ్రీనివాస రెడ్డికి సిఎం ఓ నుంచి ఫోన్ రావడం వల్లనే నిన్నే హైదరాబాద్ కూడా తరలి వెళ్లినట్లుగా చెబుతున్నారు. ఈసారి అంతా పాజిటివ్ గా ఉంటుందని ఆయన వర్గం చెబుతోంది. పీకే సర్వే వల్లనే ఈసారి పొంగులేటికి రాజ్యసభ సీటు రానున్నట్లుగా చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఖమ్మం ఎంపీగా పోటీ చేసి గెలుపొందడమే కాకుండా అశ్వరావుపేట, వైరా, పినపాకలలో ఎంఎల్ఎ లను ఆ పార్టీ నుంచి గెలిపించుకున్నారు. అయితే అందరు ఆ తరువాత టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్న విషయం తెలసిందే. అయితే 2019 లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పొంగులేటికి అధిష్టానం సీటును ఇవ్వలేదు. అయినప్పటికీ పార్టీ కోసం పని చేస్తున్నారు. తన వర్గాన్ని జిల్లాలో పెంచుకున్నారు. వర్గ రాజకీయాలు చేస్తాడన్న ప్రచారం పొంగులేటి మీద ఉండడంతో ఆయనకు పదవులు దూరం అవుతున్నాయన్న ప్రచారం ఉంది. అయితే తాను మాత్రం పార్టీలోనే ఉంటూ జిల్లాలో పట్టు గలిగిన నాయకుడిగా తయారు అయ్యాడు. ఇదే ఇప్పుడు పొంగులేటికి ప్రాధాన్యత తెచ్చిందా అన్న ప్రచారం సాగుతుంది.
గత నాలుగేళ్ళుగా ఏ ఎంఎల్ సి ఎన్నికలు వచ్చినా, రాజ్యసభ ఎన్నికలు వచ్చిన ముందు పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేరు మాత్రం వస్తుంది. ఆయనకే సీటు వస్తున్నట్లుగా ప్రచారం సాగుతుంది. కాని సీటు మాత్రం రావడం లేదు. ఇలా అనేక సార్లు జరిగింది. అయితే ఇస్తున్నాం.. వస్తుంది అన్న ప్రచారం.. ఆ తరువాత ఆ సీటు రాకపోవడంతో పొంగులేటి పై సాను భూతి పవనాలు ఆకాశం అంతా ఎత్తుకు ఎదుగుతున్నాచయి. అయితే ఈసారి మాత్రం అలా ఉండకపోవచ్చనే అంటున్నారు. ప్రధానంగా పీకే సర్వే రిపోర్టులో సొంగులేటికి మంచి ప్రాధాన్యత గల లీడర్ గా ఉన్నట్లుగా వచ్చిందంట. దీనికి తోడుగా పొంగులేటి చేసుకున్న సర్వేలో కూడా ఆయనకు 70 శాతానికి పైగా ప్రజలు మద్దతు ఇస్తున్నట్లుగా ఉందిట. ఈనేపథ్యంలోనే పొంగులేటి పై అధిష్టానం కూడా సానుకూలంగా వుందని అంటున్నారు. ఈసారి పొంగులేటికి రాజ్యసభ సీటు గ్యారంటీ అంటున్నారు. పొంగులేటికి రాజ్యసభ వస్తే అందరు ఎంఎల్ఎ లు కూడా ప్రశాంతంగా ఉండవచ్చంట. వారందరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోతాయంటున్నారు. పొంగులేటికి ఎంపి పదవి వస్తే ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యర్ధులు వీక్ అవుతారన్న ప్రచారం కూడా వుంది. 18 వతేదీన పొంగులేటి నామినేషన్ లు వేస్తారన్న సోషల్ మీడియా ప్రచారంలో ఎంత మేరకు నిజం ఉందో ఒకటి రెండు రోజులు పోతే కానీ స్పష్టం కాదని అంటున్నారు.
