Site icon NTV Telugu

RAJIV SWAGRUHA FLATS: నేటి నుంచి షురూ.. ఫేస్‌బుక్‌, యూట్యూట్‌లో లాటరీ లైవ్ స్ట్రీమింగ్

Rajiv Swagruha

Rajiv Swagruha

హైదరాబాద్ లోని బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి నేటి ఉదయం 9 గంటల నుంచి లాటరీ పద్ధతిలో ఫ్లాట్లు కేటాయించనున్నారు అధికారులు. అయితే లాటరీ షెడ్యూల్, ఇతర పూర్తి వివరాలను రాజీవ్ స్వగృహ, హెచ్ఎండీఏ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు. కాగా బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల అమ్మకానికి భారీ స్పందన లభించిన విష‌యం తెలిసిందే. అయితే ఈఫ్లాట్ల విక్రయానికి హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్ ఇవ్వ‌డంతో.. ఇవాల్లి నుంచి లాటరీ పద్ధతిలో ఫ్లాట్లు కేటాయింపు జ‌ర‌గ‌నుంది. కాగా.. బండ్లగూడలోని 2,246 ఫ్లాట్ల కొనుగోలు కోసం 33,161 దరఖాస్తులు వ‌చ్చాయి. అయితే .. పోచారంలోని 1,470 ఫ్లాట్ల కోసం 5,921 దరఖాస్తులు రాగా.. అత్యధికంగా బండ్లగూడలోని 345 త్రిబుల్ బెడ్ రూం డీలక్స్ ఫ్లాట్ల కోసం దరఖాస్తు 16,679 మంది చేసుకున్నారు.

అయితే నేడు ఉదయం 9 గంటలకు లాటరీ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. కాగా.. లాటరీ ప్రక్రియను ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లలో లైవ్‌ స్ట్రీమింగ్‌కు ఏర్పాట్లు చేశారు. ఇవాల‌ పోచారం, రేపు (28)న బండ్ల గూడ, 29న బండ్లగూడ త్రిబుల్ బెడ్ రూం డీలక్స్ ఫ్లాట్ల కోసం డ్రా ప‌ద్ద‌తిలో ఎంచుకోనున్నారు. అయితే ఈ పూర్తి ప్రక్రియను హెచ్‌ఎండీఏ అధికారులు రికార్డ్‌ చేయడ‌మే కాకుండా.. ఒకవ్యక్తికి ఒక ఫ్లాట్‌ మాత్రమే కేటాయిస్తామని వెల్లడించారు అధికారులు. ఇందుకు ప్రాతిపదికగా ఆధార్‌ సంఖ్యను తీసుకోనున్నారు. ఇతర పూర్తి వివరాలనే కాకుండా .. లాటరీ షెడ్యూల్, రాజీవ్ స్వగృహ, హెచ్ఎండీఏ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు.

Maharashtra Political Crisis:సుప్రీంకోర్టుకు చేరిన “మహా” రాజకీయం..నేడు విచారణ

Exit mobile version