Site icon NTV Telugu

Hidden treasures: రాజేంద్రనగర్‌ లో గుప్త నిధుల తవ్వకాలు.. ఎంట్రీ ఇచ్చిన ఎస్‌వోటీ

Hidden Treasures

Hidden Treasures

Hidden treasures: రంగా రెడ్డి జల్లా రాజేంద్రనగర్ బుద్వెల్ లో గుప్త నిధుల కలకలం రేపాయి. బుద్వేల్ అంజనేయ స్వామి దేవాలయం సమీపంలో నిధులు కోసం తవ్వకాలు చేస్తున్నట్లు పక్కా సమాచారం మేరకు రాజేంద్రనగర్ SOT పోలీసుల దాడులు నిర్వహించారు. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతుండగా తొమ్మిది మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారి వద్ద నుండి మూడు కార్లు, 16 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఖాళీగా ఉన్న ఇంట్లో తవ్వకాలు జరుపుతుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎంట్రీ ఇచ్చిన ఎస్‌ఓటీ 9మందిని అదుపులో తీసుకున్నారు.

Read also: Rapaka Varaprasad: ఆ వ్యాఖ్యలపై స్పందించిన రాపాక.. ఆసక్తికర కామెంట్లు..

బుద్వెల్ లో ఇందిరా, మహేశ్ ల ఇళ్ళు గత రెండేళ్ళుగా ఖాళీగా ఉంటోంది. అది తెలుసుకున్న ఇందిరామహేశ్ ల రెండవ అల్లుడు వినోద్ అక్కడ గుప్ప నిధులు ఉంటాయని తెలుసుకుని వారి ఇంట్లో తవ్వకాలు జరిపారు. వినోద్ అక్కడ వున్న చుట్టుపక్కల వారికి ఎటువంటి అనుమానం రాకుండా ఇంట్లో ఫంక్షన్ చేస్తున్నట్లుగా నమ్మించేందుకు టెంట్ లు వేయించాడు. తరచూ బాబాల దగ్గరికి వినోద్ వెల్లేవాడు. పురాతన కాలం నాటి గోడ ఉందని చెప్పడంతో గుప్త నిధుల ఆశతో తవ్వకాలు మొదలుపెట్టాడు. గత మూడు రోజులుగా తవ్వకాలు జరిపిస్తుండటంతో ఆసబ్దాలకు స్థానికులు భయభ్రాంతులు అయ్యారు దీంతో ఏం జరుగుతుందని ఆరా తీయగా.. వినోద్ ఇంట్లో తవ్వకాలు చేస్తున్నట్లు గమనించారు. షాక్‌ కు గురైన స్థానికులు ఎస్‌ఓటీ అధికారులను సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన ఎస్‌ఓటీ ఇంటిపై రైడ్ చేశారు. తవ్వకాలు చేస్తున్నవారిని రెడ్డ హ్యాండెడ్‌ గా పట్టుకున్నారు. వినోద్ తో పాటు మరో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. రాజేంద్రనగర్ పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలా ఇంకా ఎక్కడెక్కడ తవ్వకాలు చేశారు? వినోద్ కు టచ్‌ లో వున్న బాబా ఎవరు? అనే దానిపై దర్యాప్తు చేస్తు్న్నారు.

Exit mobile version