Site icon NTV Telugu

Rajendranagar DCP: అక్కడ ఎలాంటి నిధులు దొరకలేదు.. తవ్వకాలపై రాజేంద్రనగర్‌ డీసీపీ

Rejendranagar Dcp Jagadishwer

Rejendranagar Dcp Jagadishwer

Rajendranagar DCP: రంగా రెడ్డి జల్లా రాజేంద్రనగర్ బుద్వెల్ లో గుప్త నిధుల కలకలం రేపిన విషయం తెలిసిందే. గుప్త నిధుల తవ్వకాలపై రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి వివరణ ఇచ్చారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు మా టీమ్ ఆ ఇంటి పై రైడ్ చేసిందన్నారు. తవ్వకాలు జరుపుతున్న సమయంలోనే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామన్నారు. వినోద్ అనే వ్యక్తి.. తన సొంత ఇంట్లోనే తవ్వకాలు జరిపాడని, దీని వెనక బాబాలు ఎవరు లేరని అన్నారు. వినోద్ దగ్గర ఒక మెషీన్ ఉందని, భూమిలోపల నిధులు ఉంటే ఆ మెషీన్ చూపిస్తుందిని ఫ్రెండ్స్ చెప్తే.. ఆ మెషీన్ తన ఇంటికి తెచ్చుకున్నాడని డీసీసీ తెలిపారు. తన ఇంటి కాంపౌండ్ ని ఆనుకునే.. కోట గోడ బురుజు ఉండటం, పక్కనే పురాతన ఆలయాలు ఉండటంతో వినోద్ మెషీన్ తో టెస్ట్ చేశాడని అన్నారు. తన ఇంట్లో నిధులు ఉన్నట్లు మెషీన్ లో చూపించడంతో కొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి తవ్వకాలు జరిపాడని స్పష్టం చేశారు. మొత్తం 9 మందిని అరెస్ట్ చేశామని, అందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా చెప్తున్నారని తెలిపారు. అక్కడ ఎలాంటి నిధులు దొరకలేదని అన్నారు. నిందితుల్లో ఒకరు రంగారెడ్డి జిల్లా trs ప్రెసిడెంట్ గా కారుకి స్టిక్కర్ పెట్టుకున్నాడని అననారు. వీరందరిపై విచారణ జరుపుతున్నామన్నారు. నిందితుల హిస్టరీ చెక్ చేస్తున్నామని, గతంలో కూడా ఎక్కడైనా గుప్త నిధుల పేరుతో తవ్వకాలు జరిపారా అని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Read also: RRR: చరణ్ బర్త్ డే వేడుకల్లో ఆర్ ఆర్ ఆర్ టీంకి ‘చిరు’ సన్మానం…

బుద్వెల్ లో ఇందిరా, మహేశ్ ల ఇళ్ళు గత రెండేళ్ళుగా ఖాళీగా ఉంటోంది. అది తెలుసుకున్న ఇందిరామహేశ్ ల రెండవ అల్లుడు వినోద్ అక్కడ గుప్ప నిధులు ఉంటాయని తెలుసుకుని వారి ఇంట్లో తవ్వకాలు జరిపారు. వినోద్ అక్కడ వున్న చుట్టుపక్కల వారికి ఎటువంటి అనుమానం రాకుండా ఇంట్లో ఫంక్షన్ చేస్తున్నట్లుగా నమ్మించేందుకు టెంట్ లు వేయించాడు. తరచూ బాబాల దగ్గరికి వినోద్ వెల్లేవాడు. పురాతన కాలం నాటి గోడ ఉందని చెప్పడంతో గుప్త నిధుల ఆశతో తవ్వకాలు మొదలుపెట్టాడు. గత మూడు రోజులుగా తవ్వకాలు జరిపిస్తుండటంతో ఆసబ్దాలకు స్థానికులు భయభ్రాంతులు అయ్యారు దీంతో ఏం జరుగుతుందని ఆరా తీయగా.. వినోద్ ఇంట్లో తవ్వకాలు చేస్తున్నట్లు గమనించారు. షాక్‌ కు గురైన స్థానికులు ఎస్‌ఓటీ అధికారులను సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన ఎస్‌ఓటీ ఇంటిపై రైడ్ చేశారు. తవ్వకాలు చేస్తున్నవారిని రెడ్డ హ్యాండెడ్‌ గా పట్టుకున్నారు. వినోద్ తో పాటు మరో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు.
Minister Ktr: ఇది ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ముందు ఉంది

Exit mobile version