Raja Singh: ప్రజా పాలన అప్లికేషన్ ఫారమ్ ను రూ. 60 కి అమ్ముతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raja Singh: ప్రజా పాలన పథకం అప్లికేషన్ ఫారమ్ ను మీ సేవలో రూ.60 కు విక్రయిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా పాలన కార్యక్రమం నెల రోజులు పొడగించాలని డిమాండ్ చేశారు. వేలాది మంది దరఖాస్తుల కోసం వస్తే కేవలం ఒక్కో సెంటర్ లో వంద మాత్రమే అందుబాటులో పెడుతున్నారని అన్నారు. మీ సేవలో ప్రజా పాలన పథకం అప్లికేషన్ ఫారమ్ ను రూ.60లకు విక్రయిస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. అప్లికేషన్ ఫార్మ్స్ అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సెంటర్లలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అధికారులు తగిన ప్రచారం చేయలేదని మండిపడ్డారు. రేషన్ కార్డులు, కొత్త పింఛన్ల కోసం ఫార్మ్ లో ఎలాంటి వివరాలు లేవని అన్నారు. రేషన్ కార్డులు, కొత్త పింఛన్ల కోసం వైట్ పేపర్ పై రాసి ఇవ్వాలని అంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తుందని అన్నారు.
Read also: Venkatesh : చిరంజీవి లేకుంటే హిమాలయాలకు వెళ్లిపోయేవాడిని..
Also Read
గోషామహల్ నియోజక వర్గంలో 24 లోకేషన్ లలో ప్లాన్ చేశారని, అక్కడ ప్రజాపాలన ఫామ్ లు పెడుతున్నారని అన్నారు. అయితే 24 లొకేషన్ లో 100, 200 ఫామ్ లు మాత్రమే పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మునిషిపల్ కార్పొరేషన్ వారు సమావేశం పెడితే వారితో ముందుగానే చెప్పామని. ప్రజలకు సమాచారం అందించాలని, పేపర్ యాడ్ ఇవ్వాలని కోరామన్నారు. ప్రజలకు ఏఏ సెంట్రల్ లకు వెళ్లాలి, ఏ తేదీలో వెళ్లాలని సమాచారం ఇవ్వాలని ముందే చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇప్పుడు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే ఇది కొనసాగితే.. ప్రజలకు ఫారమ్ లు పూర్తీగా వివరణ ఇవ్వలేని పరిస్థితి ఉంటుందని అన్నారు. ప్రజాపాలన అంటే ముందుగానే ప్రజలకు దీనిపై అవగాహన ఇవ్వాలని తెలిపారు.
Bhatti Vikramarka: అందరికి ఒకటే మాట.. ఆరో తేదీ వరకు ధరఖాస్తు తీసుకుంటాం..
తాజావార్తలు
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!