NTV Telugu Site icon

Rajanna Sircilla: వారందరికి ఈనెల 27న రిలీవ్.. రాజన్న ఆలయ ఈవో కీలక ప్రకటన..

Rajanna Temple Eo Vinod Reddy

Rajanna Temple Eo Vinod Reddy

Rajanna Sircilla: రాష్ట్రంలో బదిలీల వాడి వేడి కొనసాగుతుండగా దేవాదాయ శాఖ ఉద్యోగుల బదిలీ మాత్రం చర్చనీయాంశంగా మారింది. అయితే ఉద్యోగులతో పాటు అర్చకులను కూడా బదిలీ చేసేందుకు కసరత్తు చేస్తుండగా ఇప్పటికే అర్చక సంఘాల నుండి వ్యతిరేకత రావడం మొదలయ్యింది. మరోవైపు దేవాదాయ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారంటూ భద్రాచలం అర్చకులు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించగా అర్చకుల బదిలీలపై స్టే ఇవ్వడం మూడు వారాల్లో సమాధానాలు ఇవ్వాలని సంబంధిత శాఖను ఆదేశించిన వ్యవహారం ఇప్పుడు దేవాదాయ శాఖలో చర్చనీ అంశంగా మారింది. ఇక పరిపాలన పరమైన ఉద్యోగులను మాత్రం బదిలీ చేస్తామని మొదటి నుండి చెబుతున్నట్లుగానే 40% మంది ఉద్యోగుల బదిలీలకు కసరత్తు పూర్తయింది.

Read also: Hyderabad Rains: రాష్ట్రంలో ఉదయం నుంచి వాన.. చిరు జల్లులతో తడిసిన తెలంగాణ..

ఇక రాజన్న ఆలయంలో మొత్తం 214 మంది ఉద్యోగులు ఉండాల్సి ఉండగా 70 మంది ఖాళీలు ఉన్నాయి. 144 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తుండగా మీరు వివరాలను ఇప్పటికే దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు పంపారు. ఈ నివేదికను ఆధారంగా చేసుకొని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు క్యాడర్ స్ట్రెంత్ ను గుర్తించి బదిలీ అయ్యే క్యాడర్ వివరాలను వేములవాడ రాజన్న ఆలయ పరిపాలన కార్యాలయానికి పంపినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. పరిపాలన పరమైన ఇబ్బందులు తలెత్తకుండా బదిలీ అయిన వారిని వెంటనే రిలీవ్ చేసి కొత్త వారిని తీసుకుంటామని వినోద్ రెడ్డి తెలిపారు. పరిపాలన పరంగా ఇబ్బందులు కలగకుండా వెంటనే రిలీవ్ చేసి వచ్చే శ్రావణమాసం సందర్భంగా ఇందుకు అనుగుణంగా ఏర్పాటు చేసుకుంటాం. బదిలీ ప్రక్రియను కూడా ఇప్పటికే నోటీసు బోర్డు ద్వారా ఉద్యోగులకు తెలియజేశాం.

Read also: Rohit Sharma: ఆ సమయంలో నా మైండ్ బ్లాంక్ అయింది: రోహిత్‌ శర్మ

ఆరు ప్రధాన దేవాలయాలుగా యూనిట్..

రాష్ట్ర దేవాదాయ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రస్తుతానికి 6ఏ పరిధిలోని దేవాలయాలను ఒక యూనిట్గా చేసి బదిలీ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఇందులో వేములవాడ, యాదగిరిగుట్ట, కొండగట్టు, కొమురవెల్లి, భద్రాచలం, బాసర దేవాలయాలను కలిపి ఆరు దేవాలయాలుగా యూనిట్ ఏర్పాటు చేశారు. ఈ ఆలయాల్లో పనిచేస్తున్న వారు ఆప్షన్ల ద్వారా ఈ ఆర్ దేవాలయాలు ఎక్కడికైనా బదిలీ జరగవచ్చు అని తెలుస్తుంది.

Read also: Muharram: హైదరాబాద్ లో మొహర్రం ఊరేగింపుకు సర్వం సిద్దం.. ట్రాఫిక్ ఆంక్షలు..

రాజన్న ఆలయంలో క్యాడర్ స్ట్రెంత్ 77..

వేములవాడ రాజన్న ఆలయంలో మొత్తం 214 మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉండగా 70 మంది పదవి విరమణ పొంది ఖాళీలుగా ఉన్నాయి. 144 మంది ప్రస్తుతం పని చేస్తున్నట్లుగా ఉన్నతాధికారులకు ఆలయ అధికారులు నివేదికలు పంపారు. దీని ఆధారంగా రాజన్న ఆలయంలో క్యాడర్ స్ట్రెంత్ ను అధికారులు డిసైడ్ చేశారు. ఇందులో డిప్యూటీ కార్యనిర్వహణ అధికారి 1, సహాయ కార్యనిర్వాహణ అధికారులు 4, పర్యవేక్షకులు 14, సీనియర్ అసిస్టెంట్లు 19, జూనియర్ అసిస్టెంట్లు 33, ఈ ఈ 1, డిఈ 2, ఏఈ 1, ఏ ఈ సివిల్ 2, లుగా క్యాడర్ స్ట్రెంత్ 77 మందిని గుర్తించారు. ఇందులో ప్రస్తుతం పని చేస్తున్న 63 మందిని మాత్రమే గుర్తించి ఇందులో 40 శాతం మంది అనగా 25 మంది ఉద్యోగులను బదిలీ చేనున్నారు. 19వ తేదీతో ఆప్షన్లు ముయ్యనుండగా 20 నుండి 27 వరకు కార్యాలయంలో పరిశీలించి 28 29 తేదీలలో ఆలయ ఉద్యోగులకు బదిలీలు జరగనున్నాయి.
Chandrababu Meets Amit Shah: అమిత్‌షాతో చంద్రబాబు సుదీర్ఘ భేటీ.. కీలక అంశాలపై చర్చ