Rajanna Sircilla: గత కొన్నేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ఉపాధ్యాయుల బదిలీలకు తెరపడింది. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో ఏళ్ల తరబడి విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులు బదిలీపై వెళ్తున్నారు. ఈ సందర్భంగా మాస్టారు మమ్మల్ని విడిచిపెట్టొద్దని పాఠశాల విద్యార్థులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న సంఘటనలు చూస్తున్నాం. ఇదీ తాజా ఘటన రాజన్న సిరిసిల్ల – ఎల్లారెడ్డి పేట మండలం కిషన్ దాస్ పేట ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది.
Read also: Donald Trump: ఆ దేవుడి ఆశీస్సులే నన్ను కాపాడాయి..
10 ఏళ్లు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుడు శ్రీనివాస్ పాఠశాల నుండి బదిలీ అయ్యాడు. పిల్లలతో మమేకంగా ఉన్న శ్రీనివాస్ పాఠశాలను విడిచి వెళ్తున్నప్పుడు, విద్యార్థులు మమ్మల్ని వదిలి వెళ్లొద్దు సారూ అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. పిల్లలే కాదు అక్కడు టీచర్లు కూడా అందరూ పట్టుకుని కన్నీరుతో వీడ్కోలు పలికారు. ఇన్ని రోజులు పిల్లలకు మంచిగా పాఠాలు చెప్పి విద్యాబుధ్దులు నేర్పిన వారికి పిల్లులు వదులుకోలేకపోయారు. సార్ మీరు వెళ్లకండి అంటూ గుక్కపట్టి ఏడ్చారు. సార్ ను వెళ్లకుండా నడుమును గట్టిగా పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చారు. పిల్లల అభిమాన్ని చూసిన సార్ కూడా తట్టుకోలేక పోయారు.
కన్నీటితో నేను వస్తుంటాను.. మీరెవరు ఏడ్చకండి అంటూ సముదాయించిన్నా పిల్లలు మాత్రం సార్ వదలకుండా వెళ్లకండి అంటూ ఏడ్చారు. దీంతో సార్ వారిని పట్టుకుని ఏడుస్తూ అక్కడే కాసేపు ఉండిపోయారు. అక్కడ పనిచేస్తున్న టీచర్లు కూడా వేరే పాఠశాలకు బదిలీ అయ్యారు వీరు కూడా ఒకనొకరు పట్టుకుని కన్నీటిపర్వంతం అయ్యారు. ఇది చూసిన పిల్లల తల్లిదండ్రులు కూడా కన్నీరు కార్చారు. వేరే సార్ వద్దు మాకు ఈ సారే కావాలంటూ పిల్లలు ఏడ్చిన తీరు అక్కడున్న వారిని కూడ కండతడి పెట్టించింది. అయితే.. ఇన్నాళ్లు తమ ఉన్నతి కోసం పరితపించి తరగతి పాఠాలే కాదు జీవిత పాఠాలు బోధించిన ఉపాధ్యాయుడి చుట్టూ చేరి తమను వీడి వెళ్లిపోవద్దంటూ వెక్కివెక్కి ఏడ్చారు.
Heavy Rains: భారీ వర్షాల ఎఫెక్ట్.. విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవు..