NTV Telugu Site icon

Shalini Kidnap Case: శాలిని కిడ్నాప్ కేసులో ఊహించని ట్విస్ట్.. యువతికి ఆల్రెడీ పెళ్లి

Shalini Kidnap Case Twist

Shalini Kidnap Case Twist

Rajanna Sircilla Shalini Kidnap Case Takes Unexpected Turn: రాజన్న సిరిసిల్లా జిల్లాలో సంచలనం సృష్టించిన శాలిని కిడ్నాప్ కేసులో తాజాగా ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది. కిడ్నాప్ చేసిన జాన్‌కి, శాలినికి ఇదివరకే పెళ్లి అయ్యింది. అయితే.. శాలిని మైనర్ కావడం, ఈ పెళ్లి కూడా ఇష్టం లేకపోవడంతో యువతి తల్లిదండ్రులకు కేసు పెట్టారు. ఈ కేసులో జాన్ పది నెలల జైలు శిక్షను కూడా అనుభవించాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత జాన్ మళ్లీ శాలినికి దగ్గర అవుతుండడంతో.. తల్లిదండ్రులకు ఆమెకు మరో యువకుడితో నిన్న (సోమవారం) నిశ్చితార్థం జరిపించారు. ఈ విషయం తెలుసుకున్న జాన్.. పక్కా ప్లాన్ ప్రకారం ఈ కిడ్నాప్ వ్యవహారానికి తెరలేపాడు. తెల్లవారుజామున ఆలయంలో పూజ ముగించుకొని శాలిని బయటకు రాగానే.. ఆమె తండ్రి ముందే తన స్నేహితుల సహకారంతో బలవంతంగా కారులో ఎక్కించుకొని, అక్కడి నుంచి వెళ్లిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. శాలిని ఆచూకీ కోసం మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

Kerala Couple With Jersey: ఫిఫా వరల్డ్‌కప్‌ ఫీవర్.. జెర్సీలతో పెళ్లి పీటలెక్కిన వధూవరులు

అసలు ఈ కిడ్నాప్ ఎలా జరిగిందంటే.. మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు శాలిని తన తండ్రితో కలిసి హనుమాన్ ఆలయానికి వెళ్లింది. పూజ ముగించుకొని బయటకు వచ్చింది. అప్పటికే అక్కడ తన స్నేహితులతో మాటువేసిన జాన్.. శాలిని బయటకు రావడం గమనించి, వెంటనే కార్ వేసుకొని ఆలయం ముందుకు వచ్చాడు. బలవంతంగా ఆమెని కారులో ఎక్కించుకున్నాడు. తండ్రి ప్రతిఘటించడానికి ప్రయత్నించాడు కానీ, జాన్ స్నేహితులు ఆయన్ను అడ్డుకున్నారు. అటు శాలిని పారిపోవడానికి ప్రయత్నించగా, మరో యువకుడు ఆమెని పట్టుకొని కారులో ఎక్కించాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ కిడ్నాప్ వ్యవహారం మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. జాన్‌కి ఎవరెవరు సహకరించారు? ఆ కారు ఎవరి పేరు మీద రిజిస్టర్ అయ్యుంది? వీళ్లంతా ఎక్కడికి వెళ్లి ఉంటారు? అనే కోణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Corona Fear: ఏపీలో విచిత్ర ఘటన.. నాలుగేళ్లుగా తల్లి, కూతురు ఇంటికే పరిమితం