Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా గత రాత్రి నుండి ఏడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జలమయమైన లోతట్టు ప్రాంతాలు. శ్రావణ చివరి ఆదివారం కావడంతో రాష్ట్ర వ్యాప్తం నుండి పెద్ద ఎత్తున భక్తులు వేములవాడ రాజన్న సన్నిధి చేరుకున్నారు. అయితే వేములవాడ పట్టణంలో భారీ వర్షం కురుస్తుండడంతో రాజన్న భక్తులు తడిసి ముద్దయ్యారు. ఒకవైపు వర్షం కొనసాగుతున్న మరోవైపు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకుంటు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు బద్ది పోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించే మహిళలు వర్షంలోనే తడుస్తూ అమ్మవారికి మొక్కలు చెల్లిస్తున్నారు. వేములవాడ నియోజక వర్గంలో వాగులు వంకలు పొంగుతున్నాయి. నిమ్మ పెల్లి ప్రాజెక్టు నిండి, అలుగు పారుతుండడంతో వేములవాడ మూల వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. బోయినపల్లి మండలం లో భారీ వర్షానికి పొంగిపొర్లుతున్న వాగులు వంకలు నిండిపోయి పంట పొలాల్లో సైతం వర్షపు నీరు వచ్చి చేరుతుంది.
Read also: Traffic Challan: నిబంధనలను అతిక్రమిస్తే.. నేరుగా మొబైల్ నెంబర్‌కు ట్రాఫిక్ చలాన్..
శ్రావణ చివరి ఆదివారం రాజన్న ఆలయానికి వచ్చిన భక్తులు తడిసి పోయారు. అలాగే బోయినపల్లి నుండి వేములవాడ వైపు వెళ్లే కల్వర్టు పై నుండి నీరు రావడంతో రాకపోకలు నిలిచి పోయాయి. మరోవైపు ఇళ్ళంతకుంట మండలం పెద్దలింగాపురం లో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరద నీటితో మూల వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. పెంట వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. కోనరావుపేట మండలం కొండాపూర్, వెంకట్రావుపేట గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్ మానేర్ కు భారీగా చేరుతున్న వరద నీరు చేరింది. ఇన్ ఫ్లో 16 వేల 666 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 6 వేల 350 క్యూసెక్కులు, 15.7 టీఎంసీ లకు చేరిన నీటి నిలువ. పూర్తి స్థాయి నీటి నిలువ 25.7 టీఎంసీ. రెండు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్న అధికారులు.
Read also: Bangladesh : బంగ్లాదేశ్‌లో వరద విధ్వంసం.. 59మంది మృతి.. ఇబ్బందుల్లో 54లక్షల మంది
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల , శంకర్పల్లి వాగు ,మొయినాబాద్, షాబాద్ మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. శనివారం రాత్రి కురిసిన వర్షానికి శంకర్పల్లి మూసి వాగు దేవరంపల్లి ఈసీ వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. షాబాద్ మండల కేంద్రంలోని పహిల్వాన్ చెరువు, చందనవెళ్లి పెద్ద చెరువు, గోపిగడ్డ, మాచన్‌పల్లి తదితర గ్రామాల చెరువులు అలుగు పారుతున్నాయి. అదే విధంగా చేవెళ్ల నియోజకవర్గ లోనీ తదితర గ్రామాల్లో వాగులు ప్రవహించాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, ప్రజాప్రతినిధులు సూచించారు.
Nagarjuna Sagar: మళ్లీ కృష్ణమ్మ పరవళ్లు.. నాగార్జున సాగర్ 26 గేట్లు ఎత్తివేత…