Site icon NTV Telugu

Raja Singh: మతం ప్రబలింది మరోసారి మీ సేవకు హాజరయ్యాను రాజా సింగ్‌ ట్వీట్‌ వైరల్

Raja Singh Tweet

Raja Singh Tweet

Raja Singh: మత విద్వేష వ్యాఖ్యల కేసులో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. దాదాపు 40 రోజుల పాటు జైలు జీవితం అనుభవించిన ఆయనకు బుధవారం బెయిల్ మంజూరు చేస్తూ.. తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. కొన్ని షరతులతో కూడిన బెయిల్‌ను ధర్మాసనం మంజూరు చేసింది. ఇకపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని, ముఖ్యంగా మతాలను కించపరిచే విధంగా అభ్యంతకరమైన కామెంట్లు చేయకూడదని సూచించింది. అలాగే.. మీడియా ముందుకు రాకూడదని, 3 నెలల వరకు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్ట్ చేయకూడదని, జైలు నుంచి విడుదలయ్యే వేళ ర్యాలీలు సైతం నిర్వహించకూడదని షరతులు విధించింది.

అయితే నిన్న బుధవారం బెయిల్‌ పై బయటకు వచ్చిన రాజాసింగ్‌ తన సోషల్‌మీడియాలో ఓపోస్ట్ వైరల్‌ గా మారింది. మతం ప్రబలింది మరోసారి మీ సేవకు హాజరయ్యాను జై శ్రీరామ్‌ అంటూ చేసిన ఓపోస్ట్‌ చర్చకు దారితీస్తోంది. పలు షరతులతో బయటకు వచ్చిన తన ట్విటర్ ఖాతాలో చేసిన పోస్ట్ మళ్లీ చర్చకు దారితీస్తోంది. ఆయన సోషల్‌ మీడియాలో చేసిన పోస్ట్‌ చేయడంతో ధర్మాసనం షరతులను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. మీడియా ముందుకు రాకూడదని, 3 నెలల వరకు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్ట్ చేయకూడదని షరతులు విధించిని బేఖారు చేసిన రాజాసింగ్‌ ట్విట్టర్‌ లో చేసిన పోస్ట్‌కు మరి ధర్మాసనం ఎలా సందించనుందో చూడాలి.

అయితే.. స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారుఖీ షోను హైదరాబాద్‌లో నిర్వహించొద్దని మొదటి నుంచి రాజాసింగ్ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే! అయితే.. తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత మధ్య అతని షో నిర్వహించడంతో, అందుకు ప్రతీకారంగా రాజాసింగ్ ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో ఒక వర్గాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడంతో.. తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేగింది. అప్పుడు బీజేపీ రాజాసింగ్‌ని సస్పెండ్ చేసింది. ఆ సమయంలోనే సమాజంలో మతవిధ్వేషాలు రెచ్చగొట్టే విధంగా రాజాసింగ్ వ్యవహరిస్తున్నారంటూ.. ఆయనపై ఆగస్టు 25న పోలీసులు పీడీ యాక్టు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. అప్పట్నుంచి ఆయన చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేయడాన్ని రాజాసింగ్ భార్య ఉషాబాయి వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. దీనిపై ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ కౌంటరు దాఖలు చేశారు. అటు రాజాసింగ్ తరఫు న్యాయవాది రవిచందర్‌, ఇటు అడ్వొకేట్‌ జనరల్‌ ప్రసాద్‌ తమతమ వాదనలు వినిపించారు. మంగళవారం ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు.. బుధవారం షరతులతో కూడిన బెయిల్‌ని మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది.

Exit mobile version