NTV Telugu Site icon

TS Rains: తెలంగాణలో ఇవాళ కూడా వర్షాలు.. పలు జిల్లాలకు హెచ్చరికలు

Telangana Rains

Telangana Rains

TS Rains: గత రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం హైదరాబాద్ నగరంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. మేడ్చల్, రంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లోనూ రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. అయితే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దాని ప్రభావంతో నేడు కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. జనగాం, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మల్కాజిగిరి, నల్గొండ, హనుమకొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. హైదరాబాద్‌లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Read also: Astrology: సెప్టెంబర్‌ 7, గురువారం దినఫలాలు

ఏపీలోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కృష్ణా, ఎన్టీఆర్, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, గుంటూరు, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, విశాఖపట్నం, అనకాపల్లి, పశ్చిమగోదావరి, బాపట్ల, చిత్తూరు, తిరుపతి పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
Monsoon Food : వర్షాకాలంలో స్పైసీ ఫుడ్ ను తింటున్నారా? ఒక్కసారి ఇది చూడండి..