Telangana Rains: నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rains in Telangana for three days: దక్షిణ బంగాళాఖాతం ఈరోజు నైరుతి రుతుపవనాలు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగి నేడు బలహీనపడిందని అన్నారు. నేడు, రేపు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈరోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 30 – 40 కి.మీ. ఈదురు గాలులతో అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Read also: Tollywood : స్టార్ హీరోల అప్ కమింగ్ మూవీ షూటింగ్స్ ఎక్కడ జరుగుతున్నాయంటే..?
Also Read
- Karimnagar Drought: కరీంనగర్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలి.. రైతులకు నష్టపరిహారం చెల్లించాలి!
- Rahul Gandhi Hyderabad Visit: హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ?.. భారత్ సమ్మిట్, గిగ్ వర్కర్లతో ప్రత్యేక సమావేశం!
- Loan App Harassment: లోన్ యాప్ వేధింపులకు కానిస్టేబుల్ బలి..!
- Kaleshwaram Temple: భక్తులకు ముఖ్య గమనిక.. లక్షపత్రి పూజలు రద్దు, డిసెంబర్ 8 వరకు ప్రత్యేక పూజలు!
ఈరోజు తెలంగాణా జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డిలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో (గాలుల వేగం గంటకు 30 నుండి 40 కి.మీ), మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షంతో గాలులు (40-50 కి.మీ/గం) వీచే అవకాశం ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 33 డిగ్రీలు, 25 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. ఉపరితల గాలులు ఆగ్నేయ దిశలో వీచే అవకాశం ఉంది. గంటకు 6-8 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 32.8 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 24.7 డిగ్రీలు. గాలి తేమ 81 శాతంగా నమోదైంది.
Read also: Ponguleti Srinivasa Reddy: ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు పూర్తి చేసే బాధ్యత నాది..
ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో ఒకటి లేదా రెండుచోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాయలసీమలో కూడా ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
MLC Kavitha: నేటితో ముగియనున్న కవిత జ్యుడీషియల్ రిమాండ్
తాజావార్తలు
-
Karimnagar Drought: కరీంనగర్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలి.. రైతులకు నష్టపరిహారం చెల్లించాలి!
-
Rahul Gandhi Hyderabad Visit: హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ?.. భారత్ సమ్మిట్, గిగ్ వర్కర్లతో ప్రత్యేక సమావేశం!
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
-
Ravi Shastri Commentary: 1994లో మొదలైన ప్రయాణం.. కామెంటరీలో తన గురువులెవరో వెల్లడించిన రవిశాస్త్రి!
-
BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
ట్రెండింగ్
-
గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్‌కు సిద్ధం..!
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
-
IPL 2027: అతడిని ఆల్‌రౌండర్‌గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?
-
AFG vs ZIM: రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 500+ పరుగులు.. చరిత్ర సృష్టించిన జింబాబ్వే..! అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్ డ్రా..
-
India vs New Zealand 3rd ODI: భారత్, న్యూజిలాండ్ మూడో వన్డేపై వరుణుడి దెబ్బ.. మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్..!