NTV Telugu Site icon

తెలంగాణ‌కు వ‌ర్ష సూచ‌న‌.. మ‌రో మూడు రోజులు వ‌ర్షాలు..

Rains

తెలంగాణకు మ‌రో మూడు రోజులు వ‌ర్షాలు కుర‌వ‌నున్నాయి.. ఇప్ప‌టికే మూడు నాలుగు రోజుల నుంచి అక్క‌డ‌క్క‌డ భారీ గాలుల‌తో కూడా వ‌ర్షాలు కురుస్తుండ‌గా.. ఇప్పుడు విదర్భ మరియు మరత్వాడ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కి మి నుండి 2.1 కిమి ఎత్తు మధ్య ఏర్పడిన ఉపరితల ద్రోణి ఈ రోజు బలహీన ప‌డింది.. ఈ రోజు ఉత్తర- తూర్పు ఉపరితల ఆవర్తనం దక్షిణ తమళనాడు నుండి ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 1.5 కిమి ఎత్తు వద్ద ఏర్ప‌డింది.. దీని ప్ర‌భావంతో.. రాగల మూడు రోజులు (21, 22, 23వ తేదీల్లో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్త‌రు వ‌ర్షాలు కురుసే అవ‌కాశం ఉంది హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది.. ఈ రోజు, రేపు, ఉరుములు మెరుపులు మరియు గంట‌ల‌కు 30 నుంచి 40 కిలోమీట్ల వేగంతో ఈదురు గాలులు వీయ‌నుండ‌గా.. 23వ తేదీన ఉరుములు మెరుపులుతో కూడిన వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని చెబుతోంది వాతావ‌ర‌ణ కేంద్రం.