NTV Telugu Site icon

Telangana Rains: తెలంగాణలో మారుతున్న వాతావరణం.. ఆగస్టు 15 తర్వాత వర్షాలకు ఛాన్స్..!

Telangana Rains

Telangana Rains

Telangana Rains: తెలంగాణ రాష్ట్రాన్ని గత వారంలో వర్షాలు అతలా కుతలం చేశాయి. జూలై నెలాఖరున ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వానలు జిల్లాలు, గ్రామాల్లోని ప్రజల జీవనోపాధిని దెబ్బతీసింది. వర్షాలకు చాలా మంది నిరాశ్రయులయ్యారు. చాలా ఇళ్లల్లోకి నీరు చేరి నానాయాతన పడ్డారు. చాలామంది ప్రాణాలు కాపాడుకునేందుకు బిల్డింగులు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు మరొ కొంతమంది నీళ్లలో కొట్టుపోయిన ఘటనలు ఇంకా మన కళ్ల ముందు ఇంకా మెదులుతూనే ఉన్నాయి. అయితే కొద్ది రోజులుగా వర్షాలు తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రంలోని నదులు, వంకలు పొంగిపొర్లాయి. ఆగస్టు ప్రారంభం నుంచి కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు తప్ప భారీ వర్షాలు కురవలేదు. కాగా.. ఇప్పుడు మూడు రోజుల తరువాత వర్షాలు పడే ఛాన్స్‌ ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడించింది.

Read also: Twitter: ఇకపై ట్విట్టర్‌లో వీడియో కాల్‌ …. కొత్త ఫీచర్‌కు శ్రీకారం

ఆగస్టు 15 తర్వాత వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.ప్రస్తుతం ఆకాశం మేఘావృతమై ఉందని.. ఒకట్రెండు రోజుల్లో మరిన్ని మేఘాలు కమ్ముకునే అవకాశాలున్నాయన్నారు. ఆగస్టు 15 నుంచి తెలంగాణతో పాటు ఉత్తరాంధ్రలో కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. రాయలసీమలో వాతావరణం పొడిగా ఉంటుందని అంచనా. ఏపీ కోస్తాలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీనికి తోడు, సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి అంతర్గత కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా కొమోరిన్ ప్రాంతం వరకు కొనసాగుతుందని ఆయన చెప్పారు. దీని ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయి. ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కడప, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి.
Whatsapp Screen Sharing: వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్.. మీ స్క్రీన్‌ను ఇతరులతో షేర్