Telangana Rains: నైరుతి రుతుపవనాలు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా మారాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో.. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కొన్నిచోట్ల, రేపు, పలుచోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించాయి. ఈరోజు ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు ఉంటాయని, గంటకు 30 నుంచి 40 కి.మీ. వీచే అవకాశం ఉందని తెలిపుతుంది. రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Read also: CPI Narayana: ప్రతిపక్షంలో కూర్చున్నా.. కేసీఆర్‌కి జ్ఞానోదయం కలగలేదు!
తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ కామారెడ్డిలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అవకాశం ఉంది. హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 40 డిగ్రీలు, 28 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. పశ్చిమ, వాయువ్య దిశలో ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. గంటకు 6-10 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 41.0 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 30.5 డిగ్రీలు. గాలి తేమ 43 శాతంగా నమోదైంది.
Hyderabad: ఇకపై తెలంగాణకు శాశ్వత రాజధానిగా హైదరాబాద్..