NTV Telugu Site icon

Rain Alert: ఓవైపు జల్లులు మరోవైపు చలి.. రాష్ట్రానికి వర్షసూచన ఎన్ని రోజులంటే?

Hyderabad Wether Ameerpet

Hyderabad Wether Ameerpet

Rain Alert: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గత రెండు మూడు రోజులుగా వాతావరణం పూర్తిగా చల్లబడుతోంది. కనీసం మధ్యాహ్న సమయంలో కూడా ఎలాంటి మార్పులు లేవు. ఈ సమయంలో కూడా వాతావరణం చల్లగా ఉంటుంది. దీంతో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతుండగా పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు నగరంలో మబ్బుల వాతావరణం కనిపించింది. హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం కురిసింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత నగరం, శివారు ప్రాంతాల్లో చిరు జల్లులు పడగా, శుక్రవారం ఉదయం మళ్లీ ఓ మోస్తరు నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, తార్నాక, పంజాగుట్ట, చింతల్, బాలానగర్, సుచిత్ర, బేగంపేట తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. కాగా, భాగ్యనగరంలో చలి విజృంభిస్తోంది. గత మూడు రోజులుగా చలి తీవ్రత పెరగడంతో నగరవాసులు వణికిపోతున్నారు. ఒకవైపు చలితో పాటు చలిగాలులతో ఉదయం ప్రజలు బయటకు రావడం లేదు, చలికి వర్షం తోడు అవ్వడంతో చలి తీవ్రత మరింత పెరిగింది. వర్షం ప్రభావంతో చలి తీవ్రత మరింత పెరగవచ్చని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.

Read also: NTR: వెరైటీ మ్యాగజైన్ సీనియర్ ఎడిటర్ తో ఎన్టీఆర్ స్పెషల్ ఇంటర్వ్యూ…

హైదరాబాద్‌లోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వరంగల్ నగరంలో గురువారం వర్షం కురిసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలుచోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. ఆ ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా చల్లగా ఉంటుంది. హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు , చినుకులు పడటం అరుదైన దృష్యమని.. వీటిని ‘డ్రైలైన్ షవర్స్’ అంటారని రేపటి నుంచి చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు రానున్న ఏడు రోజుల పాటు వాతావరణ సూచన, హెచ్చరికల బులెటిన్‌ను విడుదల చేసింది. శుక్రవారం పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో రేపటి నుంచి ఈ నెల 10వ తేదీ వరకు పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంటుందని వెల్లడించారు. రేపటి నుంచి ఈ నెల 12 వరకు ఎలాంటి వర్షసూచన లేదని స్పష్టం చేసింది. ఇవాళ ఒక్కరోజే పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశముందని చెప్పింది.

జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు..

కొమురం భీం జిల్లా లో 14.1 గా నమోదు కాగా..ఆదిలాబాద్ జిల్లాలో 14.7 నమోదైంది. నిర్మల్ జిల్లా 16.5 నమోదు కాగా.. మంచిర్యాల జిల్లా లో 16.6 గా కనిష్ట ఉష్ణోగ్రత లు నమోదైంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో పడిపోయిన ఉష్ణోగ్రతలు సిద్దిపేట జిల్లా చీకోడ్ లో 12.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదకాగా.. సంగారెడ్డి జిల్లా సత్వార్ లో 15.8 డిగ్రీలు, ఇక మెదక్ జిల్లా రామాయంపేటలో 18.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Joshimath Land Subsidence: జోషీమఠ్‌లో 600 ఇళ్లకు పగుళ్లు.. తరలిపోతున్న ప్రజలు..