తెలంగాణలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.. ఉమ్మడి ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లో ఎండలు దంచికొడుతున్నాయి.. మరోవైపు.. హైదరాబాద్ సహా మరికొన్ని జిల్లాల్లో వాతావరణం మారిపోయింది.. వర్షాలు కురుస్తున్నాయి.. ఎండలు, ఒక్కపోత నుంచి ఉపశమనం కలిగిస్తూ.. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.. ఇక, ఇవాళ, రేపు కూడా రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఛత్తీస్‌గఢ్ నుంచి కర్ణాటక వరకు 900 మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఆవరించి ఉండడంతో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని… ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయని వెల్లడించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.
Read Also: Gunfire: అమెరికాలో మళ్లీ కాల్పులు.. 12 మందికి గాయాలు..
