Site icon NTV Telugu

అలర్ట్ : తెలంగాణలో విస్తారంగా వర్షాలు

Rains

వాయువ్య బంగాళ ఖాతం పరిసర పశ్చిమ బెంగాల్ తీరం, ఉత్తర ఒడిస్సా ప్రాంతంలో స్థిరంగా అల్పపీడనము కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనము మధ్య ట్రోపో స్ఫియార్ స్థాయి వరకు వ్యాపించింది. రాగల 2 నుండి 3 రోజులలో మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఒడిస్సా, జార్ఖండ్,ఉత్తర ఛత్తీస్ఘడ్ మీదగా వెళ్ళే అవకాశం ఉంది. ఈ రోజు ఉత్తర పశ్చిమ ద్రోణి, అల్పపీడన ప్రాంతం నుండి దక్షిణ ఛత్తీస్ఘడ్, ఉత్తర తెలంగాణా, ఉత్తర మధ్య కర్ణాటక మీదగా అరేబియా సముద్రం వరకు 4.5 నుండి 5.8 కిమి ఎత్తు వరకు ఏర్పడింది. దీంతో రాగల 3 రోజులు (13,14,15వ.తేదీలు) ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో (గాలి వేగం గంటకు 30 నుండి 40 కి మి వేగంతో)కూడిన వర్షం తెలంగాణాలో అన్ని జిల్లాలలో ఒకటి,రెండు చోట్ల మరియు భారీ వర్షములు ఈరోజు, రేపు (13,14వ తేదీలు) ఒకటి రెండు ప్రదేశములలో (ముఖ్యంగా ఉత్తర, తూర్పు జిల్లాలలో) ఒకటి రెండు ప్రదేశములలో వచ్చే అవకాశములు ఉన్నాయి.

Exit mobile version