తెలంగాణకు భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో క్రింది స్థాయిలో గాలులు, పశ్చిమ, వాయువ్య దిశల నుండి వీస్తున్నాయని… ఈ రోజు ఉపరితల ద్రోణి ఝార్ఖండ్ నుండి దక్షిణ ఒడిస్సా వరకు సముద్ర మట్టానికి 0.9 కిమి వరకు వ్యాపించి ఉందని తెలి పింది వాతావరణ శాఖ. రాగల 3 రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు… ఈ రోజు రేపు కొన్ని ప్రదేశాలలో, ఎల్లుండి చాలా ప్రదేశాలలో వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
read also : మెడికల్ కాలేజీ కోసం టీఆర్‌ఎస్ నేతల మధ్యపోటీ!
వాతావరణ హెచ్చరికలు:- ఈరోజు, ఎల్లుండి భారీ వర్షములు ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణా జిల్లాలలో ఒకటి, రెండు ప్రదేశాలలో వచ్చే అవకాశాలు వున్నవి. ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షములు చాలా జిల్లాలలో వచ్చే అవకాశాలు వున్నవి.
