NTV Telugu Site icon

TS Rain Alert: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

Ts Rain Alert

Ts Rain Alert

TS Rain Alert: తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరో ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు పలు జల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ఆదివారం రాత్రి వాతావరణ శాఖ రానున్న ఐదు రోజుల వాతావరణ బులెటిన్‌ను విడుదల చేసింది. ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షం . పడుతుందని వాతావరణ బులెటిన్‌లో పేర్కొన్నారు. రేపు ఎల్లుండి కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయి.

Read also: Tomato Price: దేశంలో భారీ వర్షాలు… డబుల్ సెంచరీ దిశగా టమాటా ధరలు

13, 14 తేదీల్లో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, మహబూబాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. 15న కూడా రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈరోజు హైదరాబాద్‌లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది, సాయంత్రం లేదా రాత్రి ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. నిన్న ములుగు జిల్లా వెంకటాపురంలో 55.2, ములుగులో 47.2, రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తిలో 48.8, కామారెడ్డి జిల్లా లింగంపేటలో 39.2, దోమకొండలో 38.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉష్ణోగ్రతలకు సంబంధించి ఆదివారం నల్గొండలో అత్యధికంగా 34 డిగ్రీల సెల్సియస్‌, మెదక్‌లో 21.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
OPPO Reno 10 Series Launch: నేడే ఒప్పో రెనో 10 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ డీటెయిల్స్ ఇవే!