బంగాళాఖాతం ఒడిశా తీరంలో 3.1 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఈశాన్య, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటల వరకు కొన్ని చోట్ల వర్షాలు కురిశాయి. అత్యధికంగా పెంట్లం(భద్రాద్రి జిల్లా)లో 6.5, పెదవీడు(సూర్యాపేట)లో 3.3, పమ్మి(ఖమ్మం జిల్లా)లో 3.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గత 20 రోజులుగా వర్షాలు లేకపోవడంతో పంటలు ఎండిపోయే ప్రమాదముందని రైతులుఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాతావరణం చల్లబడి వర్షాలు కురవడంతో పంటలకు కొంత మేలు జరుగుతుందని రైతులు పేర్కొంటున్నారు.
తెలంగాణ కు రెండు రోజుల పాటు భారీ వర్షాలు
Rains