తెలంగాణకు మరో మూడు రోజులు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నిన్న సముద్ర మట్టానికి 0.9 కిమీ ఎత్తు వద్ద ఏర్పడిన ఉత్తర దక్షిణ ద్రోణి, ఈ రోజు బలహీన పడింది. తూర్పు – పశ్చిమ ద్రోణి/షేర్ జోన్ ఈ రోజు సుమారు 17°N అక్షాంశం వెంబడి స్థిరంగా ఉండి, సముద్ర మట్టానికి 4.5 కిమీ నుండి 5.8 కిమీ మధ్య కొనసాగుతూ ఎత్తుకి వెళ్ళే కొలదీ దక్షిణ వైపుకి వంపు తిరిగి ఉంది.
read also : ప్రత్యేక హోదాపై వెంటనే చర్చ జరపాలి : విజయసాయిరెడ్డి
జులై 23న వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంగా తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణాలోని అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది. కాగా.. అటు హైదరాబాద్ లో గత మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.