Rahul Gandhi: ఇప్పటికే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. పార్లమెంట్ ఎన్నికలపై కూడా దృష్టి సారించింది. ఏది ఏమైనా సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ లోక్ సభ నియోజకవర్గాల్లో విజయభేరి మోగించాలనే ఉత్సాహంతో ముందుకు సాగనుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేలు తరచూ బహిరంగ ఎన్నికల సభల్లో పాల్గొంటున్నారు. ఎన్నికల ప్రచారానికి మరికొద్ది రోజులు మిగిలి ఉండడంతో హస్తం పార్టీ ప్రచారాన్ని వేగవంతం చేసింది.
Read also: Madhya Pradesh : ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ పై దాడి.. ఆస్పత్రి పాలు
ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంక గాంధీ, ఖర్గేల పర్యటనల షెడ్యూల్‌ను పీసీసీ వెల్లడించింది. ఈ నలుగురు నేతలు ఎప్పుడు, ఎక్కడ పాల్గొంటారనే షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు మెదక్ జిల్లా నర్సాపూర్‌లో పర్యటిస్తారు. మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకి మద్దతుగా రాహుల్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. జన జాతర సభలో రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. అనంతరం 6 గంటలకు ఎల్బీనగర్ సరూర్ నగర్ స్టేడియంలో జనజాతర సభకు హాజరవుతారని పీసీసీ తెలిపింది. రాహుల్ గాంధీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారని సమాచారం.
Read also: Peddapalli Campaign: పెద్దపల్లిలో వింత ప్రచారం.. ఓటర్ల కాళ్లు పట్టుకున్న అభ్యర్థి
రేపు 10వ తేదీ ఉదయం 10 గంటలకు పటాన్‌చెరు కార్నర్ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు మఖ్తల్ కార్నర్ మీటింగ్ ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు షాద్‌నగర్ కార్నర్ మీటింగ్‌లో ప్రియాంక గాంధీతో కలిసి సీఎం పాల్గొంటారని అందులో పేర్కొన్నారు. ఇక రేపు (10వ తేదీ) మధ్యాహ్నం 12 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు నకిరేకల్‌లో జరిగే జన జాతర సభకు హాజరవుతారు. ఈ నెల 11వ తేదీ ఉదయం 11 గంటలకు కామారెడ్డి, మధ్యాహ్నం ఒంటి గంటకు తాండూరులో జరిగే ఎన్నికల సభల్లో ఏఐసీసీ అధినేత్రి ప్రియాంక గాంధీ పాల్గొంటారు.
PBKS vs RCB: ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ కీలక పోరు.. ప్లేఆఫ్ కోసం ఫైట్..!