Raghunandan Rao Fires On CM KCR Over Reservations: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తాజాగా సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేయూ, ఓయూ యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు ఉంటాయని.. కానీ పల్లా యూనివర్సిటీలో రిజర్వేషన్‌లు లేవని సీఎం కేసీఆర్ చెప్పారని.. దళితులకు, గిరిజనులకు రిజర్వేషన్‌లు ఇవ్వని కేసీఆర్‌కు అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించే అర్హత లేదని వ్యాఖ్యానించారు. వరంగల్‌లో నిర్వహించిన నిరుద్యోగ మార్చ్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. సీపీ రంగనాథ్ తనకు చదువు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తాను వరంగల్ వచ్చి మాట్లాడుతున్నానన్న రఘునందన్ రావు.. తాను కొత్తగా వకీల్ చదువు నేర్చుకోవడం అవసరం లేదని, ఏ సెక్షన్ ఎందుకు వర్తిస్తుంది, ఏ సెక్షన్ ఎక్కడ పెడతారో తనకు బాగా తెలుసని చురకలంటించారు. టీఎస్‌పీఎస్‌సీ వ్యవహారంలో కేటీఆర్ హస్తం ఉందని ఆరోపించిన ఆయన.. సిగ్గుంటే కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్‌ని ముద్దాయిగా విచారణ చేయాలని కోరారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్నప్పుడు జనార్దన్ రెడ్డి లబ్ది చేకూర్చారని, అందుకే క్వీడ్ ప్రోకోలో భాగంగా టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్ పదవిని ఆయనకు కట్టబెట్టారని పేర్కొన్నారు. వెంటనే టీఎస్‌పీఎస్‌సీకి కొత్త కమిటీ వేయాలన్నారు.
Elephant Fights Off Crocodile: బిడ్డను రక్షించడానికి మొసలితో ఏనుగు పోరాటం.. వీడియో వైరల్..
అంతకుముందు.. సుఖేశ్ చంద్ర రాసిన లేఖపై రఘునందన్ స్పందించారు. ఈ లేఖ సంచలనాలకు కేంద్రబిందువుగా నిలుస్తోందని, బీఆర్ఎస్ పెద్దలతో చేసిన చాట్‌లో సుఖేశ్ బయటపెట్టారని తెలిపారు. తెలంగాణభవన్‌లో రూ.కోట్లు అప్పగించినట్లు ఆ చాట్‌లో ఉందన్నారు. రూ.15 కోట్లు బ్లాక్ రేంజ్ రోవర్ కారు(నం.6060)లో ఇచ్చినట్లు ఆ చాట్‌లో ఉందని ఆరోపించిన ఆయన.. ఆ కారు ఎవరిదో రవాణాశాఖ అధికారులు, పోలీసులు తెలపాలని డిమాండ్ చేశారు. ఆ కారు ఎవరిది.. ఎవరి పేరు మీద రిజిస్టర్ అయిందో తేల్చాలని కోరారు. మనీ లాండరింగ్‌లో ప్రత్యక్షంగా ప్రమేయం ఉన్నట్లుగా అనుమానిస్తోన్న బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల గుర్తింపును రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు లేఖలో విజ్ఞప్తి చేశారు. ఓ రాజకీయ పార్టీగా ఉంటూ బీఆర్ఎస్ మనీ లాండరింగ్‌కు పాల్పడిందని, కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ఈ విషయంలో పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించాలంటూ సీఈసీని కోరారు. ఈ కేసును సంబంధిత కేంద్రీయ దర్యాప్తు ఏజెన్సీకి బదలాయించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరిన ఆయన.. బీఆర్ఎస్ ఎన్నికల గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదని ప్రశ్నించారు.
Kishan Reddy: అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదు.. కిషన్ రెడ్డి విమర్శలు