NTV Telugu Site icon

Raghunandan Rao: రేవంత్ రెడ్డి కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు

Raghunandan Rao

Raghunandan Rao

Raghunandan Rao: సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. కాళేశ్వరం పై వివరాలు ఇవ్వాలని కాగ్ కోరిన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని తెలిపారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేయించాలని రేవంత్ రెడ్డి గతంలో డిమాండ్ చేశారని గుర్తు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని ప్రచారం చేశారని మండిపడ్డారు. రేవంత్, రాహుల్ గాంధీ మేడిగడ్డకి వెళ్లి కేసీఆర్ నీ కాళేశ్వరం కరప్షన్ రావు అని అన్నారని తెలిపారు. కాళేశ్వరం పేరుతో కెసిఆర్ లక్ష కోట్లు దోచుకున్నాడు… ఆ డబ్బులను వసూలు చేసి పేద ప్రజల అకౌంట్స్ లో వెస్త అని రాహుల్ అన్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి ఇప్పుడు సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు? అని ప్రశ్నించారు.

Read also: Oyo Rooms : ఓయో రూమ్స్ బుకింగ్స్ లో హైదరాబాదే టాప్.. ఆ ఒక్కరోజే ఎక్కువట..

రేవంత్ కు ఉన్న అభ్యంతరం ఏంటి? ఎందుకు లేఖ రాయడం లేదు? అంటూ ప్రశ్నలు సంధించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను మెడిగడ్డ వరకే పరిమితం చేయాలని చూస్తున్నారు… కుట్ర జరుగుతుందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మీద అనుమానం వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం మొత్తం మీద విచారణ జరగాలన్నారు. స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఒక వ్యక్తి చేసిన అతిపెద్ద అవినీతి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని తెలిపారు. సాక్ష్యాధారాలు ఉన్నాయని గతంలో రేవంత్ రెడ్డి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కి లేఖ రాశారని గుర్తు చేశారు. ఇప్పుడు సీఎం గా తన దగ్గర ఉన్న ఆధారాలను పంపాలని డిమాండ్ చేస్తున్నానని తెలిపారు.
Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్.. కాంగ్రెస్ పెద్దలతో మూడు అంశాలపై చర్చ

Show comments