NTV Telugu Site icon

Raghunandan Rao: రాజకీయాల్లో విలువలు లేని వ్యక్తి రేవంత్ రెడ్డి

Raghunandan Rao

Raghunandan Rao

Raghunandan Rao comments on Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం కాకరేపుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో తెలంగాణలో మరోసారి ఉపఎన్నికలు రాబోతున్నాయి. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీని కలరవపెట్టింది. దీంతో పార్టీ నేతలు రాజగోపాల్ రెడ్డిపై ఎదురుదాడి ప్రారంభించారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా అనంతరం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. వ్యాపారం కోసమే బీజేపీలో చేరుతున్నారంటూ.. తల్లి లాంటి సోనియా గాంధీకి ద్రోహం చేశారంటూ విమర్శించారు.

ఇదిలా ఉంటే తాజాగా బుధవారం బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. రాజకీయాల్లో విలువలు, వలువలకు తేడా తెలియన వ్యక్తి రేవంత్ రెడ్డి అన్ని దుయ్యబట్టారు. టీడీపీలో గెలిచి.. పార్టీ మారిన వ్యక్తి రేవంత్ రెడ్డి అన్ని విమర్శించారుు. కానీ రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని గుర్తు చేశారు. టీడీపీలోొ ఎమ్మెల్యేగా గెలిచి 14 నెలల కాంగ్రెస్ లో ఉన్నారంటూ దుయ్యబట్టారు. రేవంత్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆ పార్టీ లేకుండా పోతుందని అన్నారు. రేవంత్ రెడ్డి ఎందుకు పార్టీ మారారని..? ఏ వ్యాపారం కోసం పార్టీ మారారని.. ప్రశ్నించారు. ఢిల్లీలో కాంగ్రెస్ లేదని.. గల్లీలో రాదని.. అని ఎద్దేవా చేశారు. రేవంత్ ఎవరికి ఏజెంటో అందరికీ తెలుసని అన్నారు. సోనియాను బలి దేవత అని రేవంత్ రెడ్డి అనలేదా..? అని ప్రశ్నించరాు. రేవంత్ వల్లే అందరూ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారని.. ఆయన విమర్శించారు.

Read Also: DK Aruna: రేవంత్ కు వార్నింగ్.. నోరు జర భద్రంగా పెట్టుకో..

నాణేనికి బొమ్మ బోరుసులా కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల ఉన్నాయని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి పాత్రేంటని రఘునందన్ రావు ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో పట్టపగలు దొరికిన వ్యక్తి రేవంత్ అని విమర్శించారు. కాంగ్రెస్ పునర్జీవనం సాధ్యం కాదని స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్దిని మునుగోడు ప్రజలు మళ్లీ గెలిపిస్తారని అన్నారు. మీ భాషలో సమాధానం చెప్పేందుకు మేం సిద్ధమని అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని..మునుగోడు ఉపఎన్నిక తర్వాత టీఆర్ఎస్ ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు.

Show comments