Site icon NTV Telugu

Rachakonda Police: అందుకే కదా అర్థాంగి అంటారు.. ఫన్నీ స్టోరీ పోస్ట్ చేసిన రాచకొండ పోలీస్..

Rachakonda Police

Rachakonda Police

Rachakonda Police: తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరిగిపోయాయి. సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీసులు నిరంతరం శ్రమిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. అయితే.. రాచకొండ పోలీసులు మాత్రం సైబర్ నేరాలు అర్థమయ్యేలా కథ చెప్పి వినూత్న ప్రయోగం చేశారు. ప్రస్తుతం రాచకొండ పోలీసులు పోస్ట్ చేసిన ఈ ఫన్నీ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read also: Telangana Rains: వచ్చే వారం నుంచి తెలంగాణలో భారీ వర్షాలు..

రావు రిటైర్ అయ్యాడు.. పెద్ద మొత్తంలో రిటైర్మెంట్ అమౌంట్ వచ్చింది. రూ. 20 లక్షలు. తన మరియు భార్య జాయింట్ అకౌంట్లో ఉంచి, ఆమెకు ఎటిఎం కార్డు పిన్ కూడా చెప్పారు. ఒకసారి పనిమీద గంట సేపు బయటకు వెళ్లాక్ ఫోన్ మర్చిపోయానని గుర్తుకొచ్చింది. వెంటనే ఇంటికి వచ్చారు. సోఫాలో పడివున్న ఫోన్ చూసి కుదుటపడ్డారు. సోఫాలో కూర్చొని భార్యను “ఫోన్ వచ్చిందా?” అని అడిగారు. “అవునండి. బ్యాంకు నుంచి ఫోన్ వచ్చింది జాయింట్’ అకౌంట్’ సమాచారాన్ని అప్డేట్ చేయమని” అని చెప్పింది భార్య. రావుగారికి చెమటలు పట్టి సోఫాలో కూలబడ్డాడు. భయాందోళనతో “ఒ.టి.పి. ఇచ్చావా..?” అని అడిగాడు. భార్య అవును అని సమాధానం చెప్పింది. బ్యాంకు మేనేజర్ స్వయంగా నాకు ఫోన్ చేయగా నేను అతనికి ఇచ్చాను. భార్య మాటలను విన్న రావుగారు ఇంకా కుప్పకూలిపోయాడు.

Read also: TGPSC Group 4: నేటి నుంచి గ్రూప్‌ 4 ధ్రువీకరణ పత్రాల పరిశీలన.. ఎప్పటి వరకు అంటే..

తల తిరుగుతున్నట్టు అనిపించింది. తన మొబైల్ ఫోన్లో బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేశాడు. ఇందులో రూ.20 లక్షలు అలాగే ఉన్నాయి. ఏ ఓటీపీ ఇచ్చావు అని అడిగారు. భార్య అమాయకంగా చెప్పింది ఓటీపీ 4042గా వచ్చింది. జూయింట్ అకౌంట్ కదా.. నా వంతు ఓటీపీ 2021 ఇచ్చానని చెప్పింది. రావుగారికి పోయిన ప్రాణం వచ్చినట్లు అనిపించింది. హమ్మయ్య ఇంత తెలివైన భార్య నాకు దొరకడం అదృష్టం అనుకున్నాడు. జాయింట్ అకౌంట్ పెట్టుకోవడం ఇంత సేఫా అనుకుని.. అందుకనే కదా అర్ధాంగి అంటారు..! అంటూ క్యాప్సన్ ఇస్తూ ఈ ఫన్నీ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలాంటి వినూత్న ప్రయోగాలు చేసి ప్రజలను ఆకట్టుకునేలా తమాషా పోస్ట్‌లను అందరూ చదవాలని భావించి సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఈ తరహా కొత్త ప్రయోగాలు చేస్తోంది. ఇలాంటి పోస్టులు చూసి నవ్వుకోవడమే కాకుండా సైబర్ నేరాల విషయంలో ఎలా జాగ్రత్తగా ఉండాలో కూడా తెలుసుకోవాలి.


Big Breaking: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు..

Exit mobile version