Rachakonda Police: అందుకే కదా అర్థాంగి అంటారు.. ఫన్నీ స్టోరీ పోస్ట్ చేసిన రాచకొండ పోలీస్..
- అందుకేగా అర్ధాంగి అంటారు!!..
- రాచకొండ పోలీసుల ఫన్నీ పోస్ట్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rachakonda Police: తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరిగిపోయాయి. సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీసులు నిరంతరం శ్రమిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. అయితే.. రాచకొండ పోలీసులు మాత్రం సైబర్ నేరాలు అర్థమయ్యేలా కథ చెప్పి వినూత్న ప్రయోగం చేశారు. ప్రస్తుతం రాచకొండ పోలీసులు పోస్ట్ చేసిన ఈ ఫన్నీ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read also: Telangana Rains: వచ్చే వారం నుంచి తెలంగాణలో భారీ వర్షాలు..
Also Read
- Betting: కోట్లు కురిపించే 'క్రికెట్ బెట్టింగ్' డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
- Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
- OTR : గ్రేటర్ ఎన్నికల కోసం సీరియస్ గా ఉన్న గులాబీ పార్టీ
- Special TET: తెలంగాణ టీచర్లకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక టెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ..
రావు రిటైర్ అయ్యాడు.. పెద్ద మొత్తంలో రిటైర్మెంట్ అమౌంట్ వచ్చింది. రూ. 20 లక్షలు. తన మరియు భార్య జాయింట్ అకౌంట్లో ఉంచి, ఆమెకు ఎటిఎం కార్డు పిన్ కూడా చెప్పారు. ఒకసారి పనిమీద గంట సేపు బయటకు వెళ్లాక్ ఫోన్ మర్చిపోయానని గుర్తుకొచ్చింది. వెంటనే ఇంటికి వచ్చారు. సోఫాలో పడివున్న ఫోన్ చూసి కుదుటపడ్డారు. సోఫాలో కూర్చొని భార్యను “ఫోన్ వచ్చిందా?” అని అడిగారు. “అవునండి. బ్యాంకు నుంచి ఫోన్ వచ్చింది జాయింట్’ అకౌంట్’ సమాచారాన్ని అప్డేట్ చేయమని” అని చెప్పింది భార్య. రావుగారికి చెమటలు పట్టి సోఫాలో కూలబడ్డాడు. భయాందోళనతో “ఒ.టి.పి. ఇచ్చావా..?” అని అడిగాడు. భార్య అవును అని సమాధానం చెప్పింది. బ్యాంకు మేనేజర్ స్వయంగా నాకు ఫోన్ చేయగా నేను అతనికి ఇచ్చాను. భార్య మాటలను విన్న రావుగారు ఇంకా కుప్పకూలిపోయాడు.
Read also: TGPSC Group 4: నేటి నుంచి గ్రూప్ 4 ధ్రువీకరణ పత్రాల పరిశీలన.. ఎప్పటి వరకు అంటే..
తల తిరుగుతున్నట్టు అనిపించింది. తన మొబైల్ ఫోన్లో బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేశాడు. ఇందులో రూ.20 లక్షలు అలాగే ఉన్నాయి. ఏ ఓటీపీ ఇచ్చావు అని అడిగారు. భార్య అమాయకంగా చెప్పింది ఓటీపీ 4042గా వచ్చింది. జూయింట్ అకౌంట్ కదా.. నా వంతు ఓటీపీ 2021 ఇచ్చానని చెప్పింది. రావుగారికి పోయిన ప్రాణం వచ్చినట్లు అనిపించింది. హమ్మయ్య ఇంత తెలివైన భార్య నాకు దొరకడం అదృష్టం అనుకున్నాడు. జాయింట్ అకౌంట్ పెట్టుకోవడం ఇంత సేఫా అనుకుని.. అందుకనే కదా అర్ధాంగి అంటారు..! అంటూ క్యాప్సన్ ఇస్తూ ఈ ఫన్నీ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలాంటి వినూత్న ప్రయోగాలు చేసి ప్రజలను ఆకట్టుకునేలా తమాషా పోస్ట్‌లను అందరూ చదవాలని భావించి సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఈ తరహా కొత్త ప్రయోగాలు చేస్తోంది. ఇలాంటి పోస్టులు చూసి నవ్వుకోవడమే కాకుండా సైబర్ నేరాల విషయంలో ఎలా జాగ్రత్తగా ఉండాలో కూడా తెలుసుకోవాలి.
Don't share your Bank Account details, OTP, ATM, or Credit card details with anyone. Be Alert, Be Smart.
#onlinefrauds #cybercrime #bealert pic.twitter.com/foqu80ZgUe
— Rachakonda Police (@RachakondaCop) June 19, 2024
Big Breaking: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు..
తాజావార్తలు
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక సంక్షేమ నిర్ణయాలపై చర్చ!
-
Upasana Konidela: ‘పెద్ది’ థియేటర్లో మెగా కోడలి ఊరమాస్ రచ్చ.. చరణ్ ఎంట్రీకి పేపర్లు ఎగరేసిన ఉపాసన!
-
Hero Flex Fuel Bikes: హీరో మోటోకార్ప్ సంచలనం.. దేశంలో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్స్ స్ప్లెండర్, HF డీలక్స్ మార్కెట్లోకి..
-
Virat Kohli – Rohit Sharma: కోహ్లీ-రోహిత్‌కు అగ్నిపరీక్ష.! రాణిస్తే వరల్డ్‌కప్.. విఫలమైతే కెరియర్ ముగిసినట్లేనా?
-
China halts J10CE Delivery: భారత్ రఫేల్‌పై ఏడ్చి.. చైనా ముందు నవ్వుల పాలైన పాక్! 16 యుద్ధ విమానాల డెలివరీని ఆపేసిన చైనా..
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!