Puvvada Ajay Kumar:తుమ్మల చెల్లని రూపాయి లాంటోడు.. పువ్వాడ అజయ్ కొత్త వంద నాణెం లాంటోడు అని ఖమ్మం BRS అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. వెనకటికి ఒక నానుడి ఉండేది.. మట్టి పనికి పోవాలన్నా మనోడు ఉండాలన్నారు. పరాయి వాడు ఉంటే మోసం చేస్తాడు జాగ్రత్త.. అని ఉండేదని ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి పరయివాడు అని నేను ఇక్కడి వాడిని ఖమ్మం లోకల్ అని పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ కు పదవి ఇస్తే అది అహంకారం అవుతుంది.. నాకిస్తే ఖమ్మం ప్రజలకు అలంకారం అవుతుందన్నారు. ఖమ్మం, పాలేరులో చెల్లని రూపాయి మళ్ళీ ఖమ్మం వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రద్దయిన నీ రాజకీయ జీవితాన్ని కేసీఅర్ పిలిచి మంత్రి పదవి ఇస్తే.. కేసీఅర్ నే మోసం చేసావని మండపడ్డారు. నిన్ను నమ్మి పదవి ఇస్తే నువ్వు చేసింది ఏమీ లేదు.. గుండు సున్నా.. నువ్వే గెలవలేదు.. ఇంక ప్రజలకు ఏం చేస్తాడని తెలిపారు. నీకు ఇచ్చిన మంత్రి పదవిని కూసుమంచి నుండి దమ్మపేట అవతల వరకు 300 ఎకరాలు పామాయిల్ తోటలు కొనుక్కుని మంచిగా స్థిర పడ్డావు.. ప్రజలకు చేసింది ఏముంది చెప్పలన్నారు.
తుమ్మల చెల్లని రూపాయి లాంటోడు.. పువ్వాడ అజయ్ కొత్త వంద నాణెం లాంటోడు అని తెలిపారు. కాంగ్రెస్ కు పదవి ఇస్తే అది ఖమ్మంకు అపకారం అవుతుంది.. అదే పదవి ఇస్తే అది ఖమ్మం ప్రజలకు అలంకారం అవుతుందన్నారు. నేను వజ్రాయుధం లాంటి వాడను.. నన్ను ఇప్పుడు కాపాడుకుంటే జీవితాంతం మీరు గర్వపడేలా ఖమ్మంను అభివృద్ది చేసి మీకు అప్పగిస్తామన్నారని తెలిపారు. ఖమ్మం, పాలేరులో చెల్లని రూపాయి మళ్ళీ ఖమ్మం వచ్చింది.. వొద్దు అని వెళ్లగొట్టినా మళ్ళీ తగుదునమ్మా అంటు ఖమ్మం వచ్చారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి ఈసారి శాస్వతంగా రాజకీయాల నుండి ఇంటికి పంపించాలని తెలిపారు. ఇంకా ధౌర్భాగ్యం ఏంటంటే నేను మంత్రి ఆయన తరువాత ఖమ్మంలో ఇంత అభివృద్ది చేస్తే అదంత నేనే చేశాను అని చెప్పుకుంటున్నాడు.. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అని మండిపడ్డారు. ఇదంత తట్టుకోలేక బ్యాలెన్స్ తప్పు మాట్లాడుతున్నాడు.. కొన్ని రోజులు అయితే ఖమ్మం ఖిల్లా ను నేనే కట్టించిన అని చెప్తాడెమో అంటూ సెటైర్ వేశారు.
Telangana: తెలంగాణలో 4 వేలకు పైగా నామినేషన్లు..