NTV Telugu Site icon

Puvvada Ajay Kumar: నేను ఐ ఫోన్ అప్డేట్ వర్షన్ లాంటివాడిని, పాత ఐఫోన్ మనకు ఎందుకు..!

Puvvada Ajaykumar

Puvvada Ajaykumar

Puvvada Ajay Kumar: నేను ఐ ఫోన్ అప్డేట్ వర్షన్ లాంటివాడిని, పాత ఐఫోన్ మనకు ఎందుకు అని ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ప్రజలందరికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మీయ సమ్మేళనంలో పువ్వాడ మాట్లాడుతూ.. సంవర్ధవంతమైన నాయకుడు ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు.
ఐ ఫోన్ అప్డేట్ వర్షన్ లాంటివాడిని, పాత ఐఫోన్ మనకు ఎందుకు అని తెలిపారు. ఒకప్పుడు మంత్రిని కలవాలి అంటే హైదరాబాద్ వెళ్లి కలవాల్సిన పరిస్థితి అని గుర్తు చేశారు. ఇప్పుడు ఎప్పుడు అంటే అప్పుడే మంత్రిని కలుస్తున్నారని అన్నారు. డాలర్ మనకు ఎందుకు మన కూరగాయల మార్కెట్ లో డాలర్ చెల్లుతుందా? అని ప్రశ్నించారు. డాలర్ బయటది మనకు వద్దు అన్నారు. ఖమ్మంని అభివృద్ధి నేను చేస్తే.. పౌడర్ వేసుకొని కొందరు ఇక్కడకు వస్తున్నారని మండిపడ్డారు.

మంత్రిని చేస్తే అందరిని ఓడించిండని అన్నారు. విజ్ఞతతో ఆలోచించించి ఓటు వెయ్యాలని కోరారు. తండ్రి ముఖ్యమంత్రి అయితేనే 3000 కోట్లు తీసుకొచ్చా అని గుర్తు చేశారు. కొడుకు ముఖ్యమంత్రి అయితే ఖమ్మంకి ముప్పై వెయ్యిలా కోట్ల రూపాయలను తీసుకొస్తా అన్నారు. మీకు పదవి వస్తే అహంకారం.. అజేయ్ కు పదవి వస్తే ప్రజలకు అలంకారమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అరాచకాలు, మతకల్లాల్లు అని తెలిపారు. కేసీఆర్ పాలనలో ఎక్కడ కూడా అరాచకాలు లేవు, రాష్ట్రంలో ఒక్కరోజైనా కర్ఫ్యూ విధించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఉంటే వార్త, మా పాలనలో కరెంట్ ఉంటే వార్త అని స్పష్టం చేశారు.

వెనకటికి ఒక నానుడి ఉండేది.. మట్టి పనికి పోవాలన్నా మనోడు ఉండాలన్నారు. పరాయి వాడు ఉంటే మోసం చేస్తాడు జాగ్రత్త.. అని ఉండేదని ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి పరయివాడు అని నేను ఇక్కడి వాడిని ఖమ్మం లోకల్ అని పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ కు పదవి ఇస్తే అది అహంకారం అవుతుంది.. నాకిస్తే ఖమ్మం ప్రజలకు అలంకారం అవుతుందన్నారు. ఖమ్మం, పాలేరులో చెల్లని రూపాయి మళ్ళీ ఖమ్మం వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రద్దయిన నీ రాజకీయ జీవితాన్ని కేసీఅర్ పిలిచి మంత్రి పదవి ఇస్తే.. కేసీఅర్ నే మోసం చేసావని మండపడ్డారు. నిన్ను నమ్మి పదవి ఇస్తే నువ్వు చేసింది ఏమీ లేదు.. గుండు సున్నా.. నువ్వే గెలవలేదు.. ఇంక ప్రజలకు ఏం చేస్తాడని తెలిపారు. నీకు ఇచ్చిన మంత్రి పదవిని కూసుమంచి నుండి దమ్మపేట అవతల వరకు 300 ఎకరాలు పామాయిల్ తోటలు కొనుక్కుని మంచిగా స్థిర పడ్డావు.. ప్రజలకు చేసింది ఏముంది చెప్పలన్నారు.
IND vs NED: బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. తుది జట్లు ఇవే!