NTV Telugu Site icon

Puvvada Ajay Kumar : ఇక్కడ కేసీఆర్‌ అనే మగాడు ఉన్నాడు..

Puvvada Ajay

Puvvada Ajay

మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు రేణుక చౌదరిపై విమర్శలు గుప్పించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతం లో నాయకులు, నాయకు రాళ్లు ఉన్నారు.. వారు రాళ్ల లాగానే ఉన్నారు.. టికెట్స్ ఇప్పిస్తామని చెప్పి డబ్బు తీసుకుని ఆడబిడ్డకు అన్యాయం చేసింది రేణుక చౌదరి అంటూ ఆయన ఆరోపించారు. ఇప్పుడు ఖమ్మంలో రచ్చబండ పేరుతో ఇష్టంవచ్చినట్లు మాట్లాడితున్నారు. . ఖమ్మంలో అజయ్ కు బ్రేక్ లు వేస్తామని మాట్లాడుతున్నారు. . కానీ అజయ్ కు బ్రేక్లువేసే సత్తా ఎవ్వరికీ లేదని ఆయన వ్యాఖ్యానించారు.

ఎలక్షన్ లు వస్తున్నాయి అంటే ఖమ్మం వచ్చి హడవిడిచేస్తున్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్క ఆడబిడ్డను అదుకోలేదు.. ఇక్కడ కేసీఆర్‌ అనే మగాడు ఉన్నాడు.. ఆయనను అడ్డుకునే శక్తి వారికి లేదంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎలక్షన్ వచ్చినప్పుడు వచ్చి అయిపోయిన తరవాత కనపడకుండా పోయే నాయకులను నమ్మొద్దని ఆయన అన్నారు. సంవత్సరానికి ఒక సారి సైబీరియా పక్షులు వస్తాయి. కానీ ఈ రాజకీయ పక్షులు.. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి వెళతారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అధికారలోకి వచ్చే వరకు మాయమాటలు చెపుతారని ఆయన మండిపడ్డారు.