Mahabubabad: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. అయ్యప్ప మాల ధారణ చేసిన స్వాములు ఆర్టీసీ డిపో ముందు ధర్నా చేపట్టారు. ఆర్టీసీ డిపోలో అయ్యప్ప స్వామి మాల ధరించి డ్రైవర్ గా పనిచేస్తున్న ఉద్యోగికి నాగరాజుకు అవమానం జరిగిందని స్వాములు తెలిపారు. రోజువారి లాగా ఆర్టీసీ డిపోలో డ్యూటీకి వచ్చే డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేశారు. అయ్యప్ప మాల ధరించిన ఆర్టీసీ డ్రైవర్ నాగరాజుకు కూడా ఆర్టీసీ అధికారులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు. అయితే తను అయ్యప్ప మాల ధరించానని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయవద్దని డ్రైవర్ నాగరాజు ఎంత చెప్పినా ఆర్టీసీ అధికారులు వినలేదు. అయినా ఆర్టీసీ అధికారులు అయ్యప్ప మాల ధరించిన డ్రైవర్ నాగరాజుకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు. దీంతో విషయం తెలుసుకున్న అయ్యప్ప స్వామి భక్తి మండలి ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో ముందు ధర్నా చేపట్టారు. స్వామి ధరించారని చెప్పిన నాగరాజు స్వామికి ఎలా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఎలా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడంతో ఆర్టీసీ డిపో మేనేజర్ అయ్యప్ప స్వాములకు క్షమాపణ చెప్పారు. దీంతో అయ్యప్ప స్వాములు వెనుతిరిగారు.
Ram Gopal Varma: ఏపీ హైకోర్టులో రామ్‌గోపాల్ వర్మ మరో పిటిషన్!
Mahabubabad: మాల ధరించిన వారికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తారా.. తొర్రూరులో స్వాముల ఆందోళన..
- హబూబాబాద్ జిల్లా తొర్రూరులోని ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత..
- రోజువారి లాగా ఆర్టీసీ డిపోలో డ్యూటీ కి వచ్చే డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు..
- విషయం తెలుసుకున్న అయ్యప్ప స్వామి భక్తి మండలి ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో ముందు ధర్నా..
- అయ్యప్ప స్వాములకు క్షమాపణ చెప్పిన ఆర్టీసీ డిపో మేనేజర్..