డాన్సర్ ను హత్య చేసిన క్యాబ్ డ్రైవర్ తో పాటు మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. డాన్సర్ ఫాతిమా భర్త ఏడాది క్రితం మృతి చెందాడు. భర్త చనిపోయిన తర్వాత క్యాబ్ డ్రైవర్ తో పరిచయం పెంచుకున్న ఫాతిమా.. ఆ పరిచయంను కాస్తా అక్రమ సంబంధంగా మారింది. కొన్ని రోజుల తరువాత తనను వివాహం చేసుకోవాలంటూ డ్రైవర్ ను ఫాతి మా ఒత్తిడి చేసింది.
దీంతో డ్యాన్సులు చేయడం వదిలిపెడితే వివాహం చేసుకుంటానని ఫాతిమాకు షరతు విధించాడు క్యాబ్ డ్రైవర్. వివాహం విషయంలో క్యాబ్ డ్రైవర్ కి ఫాతిమా ల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఫాతిమా కు మద్యం తాగించి క్యాబ్ డ్రైవర్ ఉరివేసి చంపాడు. ఈ హత్యకు క్యాబ్ డ్రైవర్ సహకరించిన తో మరొకరిని సౌత్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు.