NTV Telugu Site icon

Prof. Kodandaram: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఉద్యోగం అనే అంశమే లేదు.. కోదండరామ్ కీలక వ్యాఖ్యలు

Kodandaram

Kodandaram

Prof. Kodandaram: ఉద్యోగం అనే ఆంశమే బీఆర్ఎస్ ప్రభుత్వంలో లేదని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో కోదండరామ్ మాట్లాడుతూ.. మనిషికి ఉద్యోగం అనేది అవసరమని అన్నారు. ఉద్యోగం ఎవరికి వాళ్లు కల్పించుకునేది కాదన్నారు. ప్రభుత్వమే ఉద్యోగాలు భర్తీ చేయాలని తెలిపారు. ప్రైవేట్ రంగాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చేలా ప్రభుత్వం చూడాలన్నారు. ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్య అభివృద్ధి పెంపొందించాలని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ వ్యవస్థను నిర్లక్షం చేసిందని మండిపడ్డారు. ఈ పదేళ్లలో నిరుద్యోగం మూడింతలు పెరిగిందని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఐటి కంపెనీలు వచ్చాయని ప్రభుత్వం చెబుతుందన్నారు. కంపెనీలు వచ్చాయి, ఉద్యోగ అవకాశాలు మెరుగు పడ్డాయని చెబుతున్నారని అన్నారు.

Read also: Bhagavanth Kesari: 24 గంటల్లో ఓటీటీలోకి సింహం దిగుతుంది…

నిరుద్యోగ సమస్య తట్టుకోలేక యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. కష్టపడి చదివిన ఏ ఉద్యోగం రావడం లేదని ఆందోళన చెందుతున్నారని అన్నారు. మళ్ళీ కూలి నాలి చేసుకోవాలని ఆవేదన చెందుతున్నారని తెలిపారు. 200 మంది నిరుద్యోగులు చనిపోయారని అన్నారు. పేపర్ లీకేజీలు చేసి వ్యాపారం చేసుకుంటున్నారని అన్నారు. స్థానికులకు ఉద్యోగాల అవకాశాలు ఇవ్వాలని చాలా చోట్ల చట్టాలు తెచ్చారని అన్నారు. యువత రాజకీయ ప్రధాన శక్తిగా ఎదిగిందన్నారు. కేటీఆర్ యువత కాళ్ళ దగ్గర కూర్చొని అడుగుతున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగ సమస్య బలంగా పైకి రావడంతో ఇప్పుడు చేస్తామని చెబుతున్నారని అన్నారు. ఉద్యోగం అనే ఆంశమే ఈ ప్రభుత్వంలో లేదని అన్నారు. ఈ ఎన్నికల్లో యువత కీలకంగా పని చేయాలన్నారు. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందని తెలిపారు. బీఆర్ ఎస్ మళ్ళీ గెలిస్తే మో చెయ్యి చూపిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే మనకు న్యాయం జరుగుతుందని అన్నారు.
Errabelli Dayakar Rao: కోతుల బాధ్యత నాది.. భారీ మెజార్టీతో గెలిపించండి..