Site icon NTV Telugu

Prof Haragopal: క్రైమ్‌కి.. లిక్కర్‌కి ఇంటర్‌ లింక్.. సర్కార్‌ నేరం చేస్తుంది..!

Prof Haragopal

Prof Haragopal

తెలంగాణలో వరుసగా జరుగుతోన్న ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు ప్రొఫెసర్‌ హరగోపాల్.. చదువుకుంటున్న పిల్లలు కూడా నేరాల్లో పాల్గొంటుంటే… టీచర్లుగా మా కర్తవ్యం మేం చేస్తున్నామా అనే డౌట్ వచ్చిందన్నారు. ప్రభుత్వం నేరాలు కంట్రోల్ చేయకుండా.. నేరం చేస్తుందని దుయ్యబట్టిన ఆయన.. రాజకీయ పార్టీలు.. సమాజానికి ఏం విలువలు ఇస్తున్నాం అనేది చూసుకోవాలని సూచించారు. నగరంలో జరుగుతున్న ఘటనలు… అధికార పార్టీ తీరు మాకు కొంత విషాదకరంగా ఉందన్న హరగోపాల్.. తెలంగాణ వస్తే మెరుగైన సమాజం వస్తుంది అని అనుకున్నాం.. కానీ, రేపులు.. అత్యాచారాలు… తల్లిదండ్రులు పిల్లల్ని చంపడం లాంటివి దుర్మార్గమైన చర్యలు అన్నారు.

Read Also: Gold Price: పసిడి ప్రేమికులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన ధర

ఇలాంటి ఘటనలు ఎలా కట్టడి చేయాలనేదానిపై ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలని సూచించారు ప్రొఫెసర్‌ హరగోపాల్.. తెలంగాణను ప్రజాస్వామ్య సమాజంగా మార్చే ప్రయత్నం చేయడంలేదన్న ఆయన.. తెలంగాణలో కూడా పాత చట్టాలు ఉన్నప్పుడు ఏం మారుతుంది? అని ప్రశ్నించారు. ఎనిమిదేళ్లలో తెలంగాణ విద్యారంగాన్ని విధ్వంసం చేశారని మండిపడ్డారు.. తెలంగాణ కోసం రాసిన పాటలు కూడా బ్యాన్ అయ్యాయని.. అన్ని జేఏసీలు ధ్వంసం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక, డ్రగ్స్ కూడా పెరిగిపోయాయి.. తాగుడు పెంచుతుంది.. మైనర్‌లు పబ్బుకు పోవచ్చుఅని ఎలా చెప్తారు అధికారులు అని నిలదీశారు. పబ్బులు పోవచ్చు.. కానీ, మద్యం తాగొద్దు అంటే ఎలా ? అని ఎద్దేవా చేశారు. వరుస ఘటనలతో హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతింటుందన్న హరగోపాల్.. లిక్కర్‌పై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది.. క్రైమ్‌కి.. లిక్కర్‌కి ఇంటర్‌ లింక్‌ ఉందని స్పష్టం చేశారు. టీఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చాక.. ఇష్టారాజ్యంగా పబ్బులు పెంచారు.. ఇది చాలా దుర్మార్గం అన్నారు ప్రొఫెసర్‌ హరగోపాల్.

Exit mobile version