Prof Kodandaram Demands To Remove TSPSC Committee: ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మరోసారి స్పందించారు. తాము ప్రశ్నాపత్రాల వ్యాపారాల పోరాట కమిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇందులో అన్ని పార్టీల నేతలు, ప్రజాసంఘాలు, విద్యార్ధి నేతలు కూడా ఉంటారన్నారు. టీఎస్‌పీఎస్‌సీ కమిటీని తొలగించి, కొత్తకమిటీ వేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఆ తర్వాతే భర్తి చేయాలని కోరారు. ఈ లీకేజీ కారణంగా విద్యార్థులకు ఎంతో నష్టం జరిగిందని.. కాబట్టి ఒక్కొక్కరికి రూ. 1 లక్ష ఇవ్వాలని కోరారు. ఈ వ్యవహారంపై తాము ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిద్దామని, హైదరాబాద్‌లో పెద్ద ధర్నా చేద్దామని పిలుపునిచ్చారు. గ్రామగ్రామాన వెళ్లి ఈ లీకేజీ గురించి వివరిద్దామన్నారు. తమని అరెస్ట్ చేసినా సరే, విద్యార్థులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు భరోసా కల్పిస్తామన్నారు. ధర్నాకు ముందు పెద్దఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేద్దామన్నారు. లేకలేక ఒక నోటిఫికేషన్ వేసి, దాని పేపర్లు కూడా అమ్ముకున్నారని ఆరోపించిన ఆయన.. ప్రజలకు ఇదే చెబుదామన్నారు.
Kane Williamson: కేన్ విలియమ్సన్‌పై గుజరాత్ టైటాన్స్ బాంబ్.. ఆ భయమే నిజమైంది!
అంతకుముందు.. టీఎస్పీఎస్సీ విషయంలో ఉద్యోగులే ప్రశ్నాపత్రాలు లీక్ చేసి, వ్యాపారం చేస్తున్నారని కోదండరాం ఆరోపించారు. రాష్ట్రంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం మీద విద్యార్థులకు నమ్మకం పోయిందని పేర్కొన్నారు. గ్రూప్ 1 ప్రశ్నాపత్రం లీకేజీ కేసును సీబీఐకి అప్పజెప్పాలని, టీఎస్పీఎస్సీ పనివిధానం మీద సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్, సెక్రెటరీని వెంటనే తొలగించాలని కోరారు. పరీక్షల కొత్త షెడ్యూలను వెంటనే విడుదల చేయాలన్న ఆయన.. ప్రజలకు విశ్వాసం కల్పించాలంటే, సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ చేపట్టాలని అడిగారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన అస్తవ్యస్తంగా ఉందని, విచ్చలవిడిగా పరీక్ష పత్రాలు లీక్ అవ్వడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. భూ నిర్వాసితుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చట్ట విరుద్ధంగా పనిచేస్తుందని కూడా ఆరోపణలు చేశారు. గతంలో లిఫ్టులు ఉన్న ప్రాంతంలోనే మరో కొత్త లిఫ్ట్ తేవడం.. ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేయడమేనని అన్నారు.
Upasana Konidela: చరణ్ నన్ను డబ్బుకోసమే పెళ్లి చేసుకున్నాడు అన్నారు
