Priyanka Gandhi: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. రేపు తెలంగాణలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ పర్యటించనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రేపు ఏఐసీసీ ప్రియాంకగాంధీ రానున్నారు. ఆసిఫాబాద్, ఖానాపూర్ నియోజక వర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో ప్రియాంక గాంధీ, పీసీసీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ప్రియాంకగాంధీ జిల్లా కేంద్రానికి రానున్నారని డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ ఎదుట నిర్వహించే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారని తెలిపారు. ఆసిఫాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి షానాయక్ శుక్రవారం సమావేశ మందిరంలో ఏర్పాట్లను పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ.. బహిరంగ సభకు జిల్లా వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నిన్న (శుక్రవారం) తెలంగాణ చేరుకున్న విషయం తెలిసిందే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో రాహుల్ గాంధీ రోడ్ షోలో మాట్లాడుతూ.. చాలా దూరం నుంచి చాలా మంది నన్ను చూడడానికి వచ్చారు అని అన్నారు. తెలంగాణ రాజకీయ సంబంధం కాదు రక్త సంబంధం జవహర్ లాల్.. ఇందిర గాంధీ, రాజీవ్ సోనియా గాంధీతో మీకు సంబంధాలు ఉన్నాయి.. కాంగ్రెస్ రాష్ట్రానికి ఏమి చేసిందో నేను చెబుతాను కేసీఆర్.. మీరు చదివిన స్కూల్ కాంగ్రెస్ పార్టీదే నడిచే రోడ్డు కూడా కాంగ్రెస్ పార్టీ వేసింది అని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ యువ శక్తితో కాంగ్రెస్ కట్టింది.. 10 ఏళ్లుగా తెలంగాణనీ దోచారు దానికి అంతం పలికే రోజు వచ్చింది అని రాహుల్ గాంధీ విమర్శించారు. ఇక ఈ నెల 21 నుంచి నాలుగైదు సభల్లో పాల్గొంటారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ రెండు సమావేశాలకు ప్రియాంక గాంధీ కూడా హాజరుకానున్నట్లు సమాచారం.
IND vs AUS World Cup Final: రేపే వరల్డ్ కప్ ఫైనల్.. తెలుగు రాష్ట్రాల్లో బిగ్ స్క్రీన్లు