Priyanka Gandhi:తెలంగాణ రాష్ట్రానికి రేపు (27వ) తేదీన కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ రానున్నారు. రేపు చేవెళ్లలో జరిగే ప్రియాంక గాంధీ సభను విజయవంతం చేయాలని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. చేవెళ్ల మండల కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్‌లో పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, వికారాబాద్ జిల్లా చైర్‌పర్సన్ సునీతామహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రియాంక గాంధీ చేతుల మీదుగా చేవెళ్ల గడ్డ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండు పథకాలను ప్రారంభిస్తారని తెలిపారు. రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ రూ.10 లక్షల వైద్యసేవలు వంటి పథకాలు పేదల జీవితాల్లో ఆర్థికంగా ఊరటనిస్తాయని తెలిపారు. ఈ పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి మన జిల్లాకు వస్తున్నందున ఈ సభను విజయవంతం చేసేందుకు కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పని చేయాలని కోరారు.
Read also: Pakistan: ఖురాన్ కు విరుద్దంగా మహిళ డ్రెస్.. దాడికి పాల్పడిన యువకులు
ఈ పథకాలు ఎక్కువగా మహిళలకు సంబంధించినవని, ఈ సభకు మహిళలు పెద్దఎత్తున తరలిరావాలని సూచించారు. ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తామని, ఎన్నికల తర్వాత మన జిల్లాలో బీఆర్ ఎస్ కు అడ్రస్ ఉండదన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరాలని పిలుపునిచ్చారు. అనంతరం సభ జరిగిన మైదానాన్ని ప్రియాంక గాంధీ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ భీమ్ భరత్, సేరిలింగంపల్లి ఇన్‌చార్జి జగదీశ్వర్‌గౌడ్, మహేశ్వరం, రాజేంద్రనగర్ ఇన్‌చార్జిలు, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. చేవెళ్లకు ప్రియాంక గాంధీ రానున్న సందర్భంగా.. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తావులేకుండా ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ప్రియాంక గాంధీ చేవెళ్ల రానున్న సందర్భంగా.. ట్రాఫిక్ ఆంక్షలుఉంటాయని అధికారులు వెల్లడించారు.. ప్రజలు సహకరించాలని తెలిపారు.
Kalki 2898AD : ‘కల్కి 2898AD’ సినిమా సీక్రెట్ ను రీవిల్ చేసిన డైరెక్టర్..